కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్‌పై బాబు: అంతే వేగంతో గిఫ్ట్ ఇస్తా

Published : Dec 30, 2018, 02:44 PM IST
కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్‌పై బాబు: అంతే వేగంతో  గిఫ్ట్ ఇస్తా

సారాంశం

తెలంగాణ సీఎం కేసీఆర్ ఏం రిటర్న్ గిఫ్ట్‌ ఇస్తారో చూడాలి... దానికి తగ్గట్టుగానే ఇక్కడి నుండి కూడ కేసీఆర్ కు అదే వేగంతో తిరిగి గిఫ్ట్ ఇస్తామని కూడ చంద్రబాబునాయుడు కేసీఆర్‌ను హెచ్చరించారు.

అమరావతి: తెలంగాణ సీఎం కేసీఆర్ ఏం రిటర్న్ గిఫ్ట్‌ ఇస్తారో చూడాలి... దానికి తగ్గట్టుగానే ఇక్కడి నుండి కూడ కేసీఆర్ కు అదే వేగంతో తిరిగి గిఫ్ట్ ఇస్తామని కూడ చంద్రబాబునాయుడు కేసీఆర్‌ను హెచ్చరించారు.

ఆదివారం నాడు ఆయన  అమరావతిలో మీడియాతో మాట్లాడారు.  కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్‌లు ఇస్తే సంతోషమన్నారు.  కేసీఆర్ గిఫ్ట్ ఇస్తే అదే వేగంతో కేసీఆర్ గిఫ్ట్ ఇస్తామని  బాబు నవ్వుతూ సమాధానమిచ్చారు.

ఏపీలో వైసీపీకి మద్దతిస్తామని  చెప్పొచ్చు కదా అంటూ బాబు కేసీఆర్‌పై విమర్శించారు.  ఏపీలో వైసీపీతో  కలిసి పనిచేస్తామని చెప్పమనండి బాధ లేదన్నారు. ఫెడరల్ ఫ్రంట్ లో  కలిసి పనిచేస్తే తమకు అభ్యంతరం లేదన్నారు.

డొంక తిరుగుడు, రిటర్న్ గిఫ్ట్‌లు ఏంటండి నేరుగా సమాధానం చెప్పాలని బాబు కేసీఆర్ ను కోరారు. ఇప్పటికే వైసీపీ నేతలకు తెలంగాణలో కాంట్రాక్టులు ఇచ్చారని... ఇంకా కాంట్రాక్టులు ఇస్తారేమోనని బాబు అభిప్రాయపడ్డారు.

ఏపీ ఎన్నికల్లో  వైసీపీకి రూ. 500 కోట్లు ఇస్తారేమోనని చెప్పారు. మీ బెదిరింపులకు భయపడమని  చెప్పారు. తెలంగాణలో ప్రచారానికి పోయినట్టు చెప్పారు. ప్రజలకు న్యాయం జరగాలనే ఉద్దేశ్యంతోనే తాను ప్రచారం నిర్వహించినట్టు తెలిపారు.
 

సంబంధిత వార్తలు

ఒక్క కేసు పెడితే నాలుగు కేసులు పెడతా: కేసీఆర్‌కు బాబు వార్నింగ్

కేసీఆర్‌కు బాబు కౌంటర్: బీజేపీ, వైసీపీలతో కలిసి పోటీ చెయ్యి

 

PREV
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu
CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu