17 ఏళ్ల యువతితో వివాహేతర సంబంధం.. చివరికి ఇద్దరు కలిసి ఆత్మహత్య..?

Published : Sep 20, 2018, 10:31 AM IST
17 ఏళ్ల యువతితో వివాహేతర సంబంధం.. చివరికి ఇద్దరు కలిసి ఆత్మహత్య..?

సారాంశం

పెళ్లయి పిల్లలున్న ఓ వివాహితుడు.. ఓ 17 ఏళ్ల వయసున్న యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.. చివరికి ఏం జరిగిందో ఏమో కానీ ప్రియసితో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. 

పెళ్లయి పిల్లలున్న ఓ వివాహితుడు.. ఓ 17 ఏళ్ల వయసున్న యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.. చివరికి ఏం జరిగిందో ఏమో కానీ ప్రియసితో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణాజిల్లా తిరువూరు మండలం కోకిలంపాడు గ్రామానికి చెందిన జొన్నలగడ్డ తిరుపతిరావు ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.. అతనికి నాలుగేళ్ల కిందట వివాహం అయ్యింది.. మూడేళ్ల కొడుకు కూడా ఉన్నాడు.

ఈ క్రమంలో ఇతనికి తన స్వగ్రామానికి చెందిన శ్రీలక్ష్మీ అనే యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వద్దని పెద్దలు వారించినా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో 3 రోజుల క్రితం తిరుపతిరావు, శ్రీలక్ష్మీ గ్రామంలో కనిపించలేదు.. వీరిద్దరూ పారిపోయారని భావించిన తిరుపతిరావు భార్య తిరువూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫోన్ నెంబర్ ఆధారంగా పోలీసులు వారిని సంప్రదించి..స్టేషన్‌కు కౌన్సెలింగ్‌కు రావాల్సిందిగా పిలిచారు.

వారిద్దరూ ఓ స్నేహితుడి బైక్‌పై తిరువూరు నుంచి ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం నీలాద్రీశ్వరాలయ ప్రాంతానికి చేరుకకుని.. పురుగుల మందు తాగి.. బైక్‌పై వెళుతూ మందాలపాడు వద్ద స్పృహ కోల్పోయి పడిపోయారు. వారిని సమీపం నుంచి వెంబడించిన మిత్రుడు స్పృహతప్పిపడిపోయిన వారిద్దరిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే వీరిద్దరూ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

PREV
click me!

Recommended Stories

వొళ్ళు గగురు పుట్టే విన్యాసాలతో అదరగొట్టిన పోలీస్ సిబ్బంది | Nara Lokesh | Independence Day | Stunts
ఈ బైకర్ విన్యాసాలకి మంత్రి నారా లోకేష్ ఫిదా | Nara Lokesh Particepate Independence Day Celebrations