టీఆర్ఎస్-టీడీపీ పొత్తు లేకుండా బీజేపీ కుట్ర పన్నింది: చంద్రబాబు

Published : Sep 19, 2018, 07:27 PM IST
టీఆర్ఎస్-టీడీపీ పొత్తు లేకుండా బీజేపీ కుట్ర పన్నింది: చంద్రబాబు

సారాంశం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్, టీడీపీతో పొత్తు లేకుండా బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపించారు. అమరావతిలో టీడీఎల్పీ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు బీజేపీ టీడీపికి, ఏపీకి నమ్మక ద్రోహం చేసిందని మండిపడ్డారు. 

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్, టీడీపీతో పొత్తు లేకుండా బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపించారు. అమరావతిలో టీడీఎల్పీ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు బీజేపీ టీడీపికి, ఏపీకి నమ్మక ద్రోహం చేసిందని మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల మధ్యవివాదం ఉండకూడదని తాను ప్రయత్నించినట్లు చంద్రబాబు తెలిపారు. టీఆర్ఎస్ తో కలిసి పనిచేసేందుకు ప్రయత్నించానని గుర్తు చేశారు. 

బీజేపీ అవినీతిని బూచిగా చూపి ఏపీలో ఒకటి రెండు పార్టీలను కంట్రోల్ చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిమోట్ కంట్రోల్ బీజేపీయేనని విమర్శించారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటున్నానని బీజేపీ విమర్శించడాన్ని చంద్రబాబు నాయుడు ఖండించారు. తెలంగాణలో మాట కూడా చెప్పకుండా మా నుంచి విడిపోయింది బీజేపీ కాదా అని ప్రశ్నించారు. విభజన హామీలు నెరవేర్చనందుకే చెప్పి విడిపోయామని చంద్రబాబు స్పష్టం చేశారు.  
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్