గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...ఓ చిన్నారితో సహా ముగ్గురి మృతి

Published : Jan 02, 2019, 01:58 PM IST
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...ఓ చిన్నారితో సహా ముగ్గురి మృతి

సారాంశం

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జాతీయ రహదానిపై ప్రయాణిస్తున్న ఓ కారును వెనుకవైపు నుండి మితిమీరిన వేగంతో వచ్చిన కారు ఢీకోట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గరు మృత్యువాత పడ్డారు.   

ఈ ప్రమాదం యడ్లపాడు వద్ద జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. కంటైనర్ లారీ అతివేగంతో వెనుక నుండి ఢీ కొట్టడంతో కారు ఒక్క ఉదుటన పైకెగిరి రోడ్డు పక్కన  పడిపోయిందని స్థానికులు తెలిపారు. దీంతో కారు నుజ్జునుజ్జయ్యిందని...అందులో ప్రయాణిస్తున్న వారిలో ఓ ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలిపారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నాడు. అలాగే మరో ముగ్గురు కూడా తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడినుండి పరారయ్యాడు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని కాటూరు ఆస్పత్రికి తరలించారు. అనంతరం కారులో చిక్కకున్న  మృతదేహాలను బయటకు తీశారు. వెంటనే వాటిని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 
 
PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu