ఏపీలో ఒకే ఆలయంలో శ్రీరామనవమి, రంజాన్ వేడుకలు.. మతసామరస్యానికి ప్రతీక...

Published : Apr 11, 2022, 09:43 AM ISTUpdated : Apr 11, 2022, 09:44 AM IST
ఏపీలో ఒకే ఆలయంలో శ్రీరామనవమి, రంజాన్ వేడుకలు.. మతసామరస్యానికి ప్రతీక...

సారాంశం

ఆంధ్రప్రదేశ్ లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఒకే ఆలయంలో ఉదయం శ్రీరామనవమి వేడుకలు సాయంత్రం ఇప్తార్ విందు జరిగాయి. ఈ వేడుకల్లో హిందూ, ముస్లింలు భారీ స్తాయిలో పాల్గొన్నారు. 

ఆంధ్రప్రదేశ్ : ఆంధ్రప్రదేశ్‌లోని కదిరి మండలం పెద్దపల్లి గ్రామంలో మతసామరస్యానికి సంబంధించిన ఓ వేడుక జరిగింది. శ్రీరామనవమి, రంజాన్ వేడుకలను పురస్కరించుకుని ఆదివారంనాడు స్థానిక ఆలయ కమిటీ ఇఫ్తార్ విందు నిర్వహించగా, స్థానిక ముస్లింలు శ్రీరామనవమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఇది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అనుబంధ సంస్థ అయిన ముస్లిం రాష్ట్రీయ మంచ్ (MRM) ద్వారా నిర్వహించబడింది. హిందువులు, ముస్లింల మధ్య మత సామరస్యాన్ని, స్నేహాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

శ్రీరామనవమిని పురస్కరించుకుని.. రంజాన్ ఎనిమిదో రోజు ఉపవాస దీక్షలను దేవాలయంలో విరమించుకున్నారు. దీనికోసం AP-కర్ణాటక సరిహద్దు గ్రామమైన పెద్దపల్లిలో ఉన్న 200 ఏళ్ల నాటి శ్రీరామ మందిరానికి సుమారు 2,000 మంది హిందువులు, ముస్లింలు హాజరయ్యారు. దీనికి పొరుగున ఉన్న 24 గ్రామాల ప్రజలు వేడుకల్లో పాల్గొనడంతో ఆ గ్రామం పండుగ శోభను సంతరించుకుంది. సీనియర్ RSS నాయకుడు, MRM హోస్టింగ్ డాక్టర్ ఇంద్రేష్ కుమార్ పిలుపు మేరకు ఏపీ, తెలంగాణ అంతటా రంజాన్ 30 రోజుల పాటు MRM ఇఫ్తార్‌లను నిర్వహించడం ఇదే మొదటిసారి. తెలుగు రాష్ట్రాల గంగా-జమునీ తెహజీబ్‌ను జరుపుకోవడానికి హిందువులు, ముస్లింలు పరస్పరం పండుగలలో పాల్గొనాలని డాక్టర్ ఇంద్రేష్ సూచించారు.

"ఆలయ ప్రాంగణంలో ఇఫ్తార్‌ను నిర్వహించడం గౌరవం. మా ఆలయం బ్రిటిష్ పాలనలో సుమారు రెండు శతాబ్దాల క్రితం నిర్మించబడింది. ఇది చిన్న దేవాలయం అయినప్పటికీ చాలా చరిత్ర ఉంది. శ్రీరామ నవమిని పురస్కరించుకుని రోజంతా జరిగే వేడుకల తర్వాత సూర్యాస్తమయం సమయంలో ఇచ్చే ఇఫ్తార్‌ విందులో మేం పాల్గొన్నాం” అని ఆలయ అధ్యక్షుడు టి ఉలేష్ అన్నారు.

MRM కార్యకర్తలు 24 గ్రామాలలో పర్యటించారు. కుల, మతాలకు అతీతంగా ఇంటింటికీ బట్టలు, ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. సాయంత్రం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. MRM జాతీయ కో-కన్వీనర్, ఇది ప్రారంభం మాత్రమేనని, MRM తెలంగాణ, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఇటువంటి అనేక మతాల మధ్య సౌభ్రాతృత్వ కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు.

ఇదిలా ఉండగా, మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో Ram Navami procession సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పలు చోట్ల వాహనాలు, ఇల్లు దగ్థమయ్యాయి. దీంతో madhyapradeshలోని ఖర్గోన్‌లోని కొన్ని ప్రాంతాల్లో Curfew విధించినట్టు సీనియర్ అధికారి ఆదివారం తెలిపారు. నగరంలో ఎక్కువ మంది గుమిగూడే సమావేశాలు, సభలను నిషేధించారు. హింసాత్మక ఘటనల నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు.

రామ జన్మదినం, కల్యాణం జరుపుకునే పండుగరోజైన రామ నవమిని పురస్కరించుకుని ఊరేగింపు చేస్తున్న క్రమంలో ఘర్షణలు చెలరేగాయి. "రామ నవమి ఊరేగింపు తలాబ్ చౌక్ ప్రాంతం నుండి ప్రారంభమైనప్పుడు, ర్యాలీపై రాళ్లు రువ్వినట్లు ఆరోపణలు వచ్చాయి. పరిస్థితిని నియంత్రించడానికి పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ఖర్గోన్ నగరంలో మొత్తం ఊరేగింపు జరగాల్సి ఉండగా.. హింస కారణంగా ఉరేగింపు మధ్యలోనే ఆగిపోయింది’ అని అదనపు కలెక్టర్‌ ఎస్‌ఎస్‌ ముజల్దే అన్నారు.

ఊరేగింపులో లౌడ్ స్పీకర్ల పెట్టి పాటలు పెట్టడంతో.. స్థానిక నివాసితులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా వినకపోవడంతో.. రాళ్లు విసిరారని ఆరోపణలు వచ్చాయి. ఊరేగింపు ముస్లింలు నివసించే ప్రాంతం మీదుగా వెడుతున్నప్పుడు ఈ దాడి జరిగిందని ప్రాథమిక సమాచారం. గొడవకు సంబంధించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.

గొడవ క్రమంలో యువకులు వాహనాలకు నిప్పు పెట్టడం, కొందరు యువకులు రాళ్లు రువ్వడం, పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్‌ ప్రయోగించడం వంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ దాడిలో పోలీసు సూపరింటెండెంట్ సిద్ధార్థ్ చౌదరి సహా పలువురు పోలీసులు గాయపడ్డారు. చౌదరి కాళ్లపై రాయితో కొట్టడంతో.. కాలుకి తీవ్ర రక్తస్రావమై స్ట్రెచర్‌లో ఆసుపత్రికి తీసుకెళ్లడం కూడా కనిపించింది.

దీంతో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, ఎవ్వరూ బైటికి రావద్దని పోలీసులు ప్రకటనలు చేస్తున్నారు. ముష్కర మూకలు నాలుగు ఇళ్లకు నిప్పంటించారని, ఒక ఆలయాన్ని ధ్వంసం చేశారని సమాచారం. ఇప్పటికీ గొడవ సద్దుమణగలేదు. నగరంలో పలు చోట్ల రాళ్లు రువ్వుతున్నట్లు సమాచారం అందడంతో పొరుగు జిల్లాల నుంచి అదనపు పోలీసు సిబ్బందిని రప్పించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!