ఇచ్చాపురం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

By Arun Kumar PFirst Published Mar 26, 2024, 8:23 PM IST
Highlights

ఇప్పటివరకు ఆంధ్ర ప్రదేశ్ లో వైసిపికి గెలుపన్నదే లేని నియోజకవర్గం ఇచ్చాపురం. టిడిపి ఆవిర్భావం నుండి ఇక్కడ  పసుపుపార్టీదే హవా... కేవలం ఒకేఒక్క టిడిపి ఓడిపోయింది. 2019లో రాష్ట్రవ్యాప్తంగా వైసిపి గాలి వీచినా ఇచ్చాపురంలో మాత్రం టిడిపి గెలిచింది. ప్రస్తుతం బెదాళం అశోక్ ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే. మరి ఈసారి కూడా టిడిపి పట్టు నిలుపుకుంటుందా? లేక వైసిపి జెండా ఎగరేస్తుందా? చూడాలి.  

ఇచ్చాపురం నియోజకవర్గ రాజకీయాలు :

ఇచ్చాపురం అసెంబ్లీ తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఇక్కడ 1983 నుండి 2019 వరకు టిడిపిదే వరుస విజయం (2004 మినహా).  1983 లో ప్రారంభమైన ఎంవీ కృష్ణారావు విజయపరంపర 1999 వరకు సాగింది.  మధ్యలో 1994 ఎన్నికల్లో అచ్యుతరామయ్య టిడిపి నుండి పోటీచేసి  గెలిచారు.  

ఇక 2014 లో కాంగ్రెస్ నుండి పోటీచేసిన నరేష్ అగర్వాల్ ఇచ్చాపురంలో గెలిచారు.  అయితే 2009 నుండి మళ్లీ ఇక్కడ టిడిపిదే విజయం. 2009 లో పిరియా సాయిరాజ్, 2014, 2019 ఎన్నకల్లో బెందాళం అశోక్ గెలిచారు. 

ఇచ్చాపురం మాజీ ఎమ్మెల్య పిరియా సాయిరాజ్ టిడిపిని వీడి వైసిపిలో చేరి  2019 ఎన్నికల్లో పోటీచేసాడు. కానీ ఓటమి తప్పలేదు. దీంతో ఈసారి పిరియా విజయను వైసిపి బరిలోకి దించుతోంది.   

 ఇచ్చాపురం నియోజకవర్గ పరిధిలోని  మండలాలు :

1. కంచిలి
2. ఇచ్చాపురం 
3.  కవిటి
4.  సోంపేట

ఇచ్చాపురం అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) -  24,7,941
పురుషులు -    1,22,888
మహిళలు ‌-     1,25,033

ఇచ్చాపురం అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి :

ఇచ్చాపురంలో వైసిపి ఇప్పటివరకు గెలవలేదు. దీంతో ఈసారి ఎలాగైన ఇక్కడ జెండా ఎగరేయాలన్న పట్టుదలతో వైసిపి వుంది. దీంతో మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ భార్య విజయ పోటీ చేస్తోంది.

 టిడిపి అభ్యర్థి : 

ఇచ్చాపురం సీటు మళ్లీ బెందాళం అశోక్ కే దక్కింది. 2009 నుండి 2019 వరకు  మూడుసార్లు ఇచ్చాపురంలో పోటీచేసి గెలిచిన అశోక్ నాలుగోసారి నిలిచారు. 

ఇచ్చాపురం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :

ఇచ్చాపురం అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు -  1,68,543 (69 శాతం) 

టిడిపి - బెందాళం అశోక్ - 79,992 ఓట్లు (47 శాతం) - 3,880 ఓట్ల మెజారిటీతో విజయం 

వైసిపి - పిరియా సాయిరాజ్  - 72,847 ఓట్లు (43 శాతం) - ఓటమి

జనసేన పార్టీ - దాసరి రాజు - 11,123 (6 శాతం)

ఇచ్చాపురం అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,60,919 ఓట్లు (71 శాతం)

టిడిపి  - బెందాళం అశోక్ - 86,815 (54 శాతం) - 25,278 ఓట్ల మెజారిటీతో విజయం 

వైసిపి - నార్తు రామారావు - 61,537 (38 శాతం) - ఓటమి

click me!