జగన్‌తో శ్రీలక్ష్మి భేటీ: తెలంగాణ నుండి ఏపీకి

Published : May 31, 2019, 05:51 PM ISTUpdated : May 31, 2019, 06:05 PM IST
జగన్‌తో  శ్రీలక్ష్మి భేటీ: తెలంగాణ నుండి ఏపీకి

సారాంశం

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌ను  ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి శుక్రవారం నాడు కలిశారు. తెలంగాణ కేడర్‌కు చెందిన శ్రీలక్ష్మి ఏపీలో పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. సుమారు గంటకు పైగా ఆమె జగన్‌తో భేటీ అయ్యారు.

అమరావతి:ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌ను  ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి శుక్రవారం నాడు కలిశారు. తెలంగాణ కేడర్‌కు చెందిన శ్రీలక్ష్మి ఏపీలో పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. సుమారు గంటకు పైగా ఆమె జగన్‌తో భేటీ అయ్యారు.

అతి చిన్న వయస్సులోనే ఐఎఎస్‌గా శ్రీలక్ష్మి ఎంపికైంది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఓబుళాపురం గనుల కుంభకోణం కేసులో ఐఎఎస్ అధికారిణి శ్రీలక్ష్మి జైలు పాలైంది. 1988 బ్యాచ్‌కు చెందిన ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి జైలుకు వెళ్లడం అప్పట్లో సంచలనం.

 శుక్రవారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో శ్రీలక్ష్మి భేటీ అయ్యారు.తెలంగాణ నుండి ఏపీలో పనిచేయాలని ఆమె ఆసక్తిగా ఉంది. ఈ విషయమై జగన్‌తో చర్చించారని సమాచారం.

ఇప్పటికే తెలంగాణ కేడర్‌కు చెందిన  ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర ఏపీకి బదిలీ చేసేందుకు తెలంగాణ సర్కార్ అంగీకరించింది. మరో వైపు మరికొందరు ఐఎఎస్, ఐపీఎస్‌ అధికారులు  కూడ  ఏపీకి వెళ్లేందుకు ఆసక్తిగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది.

శ్రీలక్ష్మి కెరీర్‌లో ఎలాంటి ఒడిదొడుకులు లేకపోతే  కేంద్ర కేబినెట్ కార్యదర్శి స్థాయి వరకు ఎదిగేవారని చెబుతారు. శ్రీలక్ష్మి భర్త ఐపీఎస్ అధికారి. ఓబుళాపురం గనుల కేసు ఆమె కెరీర్‌కు మచ్చగా చెబుతారు. ఈ కేసు నుండి బయటకు వచ్చిన తర్వాత శ్రీలక్ష్మిని తెలంగాణ కేడర్‌కు కేటాయించారు.

ఏపీలో డిప్యూటేషన్‌పై పనిచేసేందుకు గాను శ్రీలక్ష్మి తెలంగాణ ప్రభుత్వానికి, డీవోపీటీకి ధరఖాస్తు చేసుకొంది. 
 

PREV
click me!

Recommended Stories

Christmas Holidays : ఓరోజు ముందుగానే క్రిస్మస్ సెలవులు.. ఎప్పటివరకో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!
Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu