హిందూపురం జిల్లా కేంద్రం కోసం రాజీనామా చేస్తా, మీరు రెడీనా: వైసీపీకి బాలకృష్ణ సవాల్

Published : Feb 04, 2022, 12:31 PM ISTUpdated : Feb 04, 2022, 01:55 PM IST
హిందూపురం జిల్లా కేంద్రం కోసం రాజీనామా చేస్తా, మీరు రెడీనా: వైసీపీకి బాలకృష్ణ సవాల్

సారాంశం

హిందూపురం జిల్లా కేంద్రం కోసం తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్దంగా ఉన్నానని బాలకృష్ణ ప్రకటించారు. శుక్రవారం నాడు పొట్టి శ్రీరాములు విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత మౌన దీక్ష చేశారు.

హిందూపురం:  హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించకపోతే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్దమని ఎమ్మెల్యే Balakrishna  సంచలన ప్రకటన చేశారు.Hindupur  జిల్లా కేంద్రంగా చేయాలని  డిమాండ్ తో ఇవాళ బాలకృష్ణ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద మౌన దీక్ష చేపట్టారు. ఈ దీక్ష ముగిసిన తర్వాత ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వైసీపీ ప్రజాప్రతినిధులు రాజీనామాకు సిద్దమా అని బాలకృష్ణ ప్రశ్నించారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కన్పించడం లేదన్నారు.

హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించి సత్యసాయి జిల్లాగా పేరు పెట్టాలని ఎమ్మెల్యే బాలకృష్ణ డిమాండ్ చేశారు.హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడానికి అన్ని అర్హతలున్నాయన్నారు. అర్ధరాత్రి జీవోలు జారీ చేసి కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారని బాలకృష్ణ విమర్శించారు. హిందూపురం జిల్లా కేంద్రం కోసం ప్రత్యక్షంగా పోరాటం చేస్తానని ఆయన ప్రకటించారు. తెలుగుదనానికి NTR ఓ సంతకం అని బాలకృష్ణ చెప్పారు.

Kadapa జిల్లాకు YSR పేరు పెడితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన TDP ప్రభుత్వం ఆ పేరును కొనసాగించిందని బాలకృష్ణ గుర్తు చేశారు. YCP అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లను ఎత్తివేసిందన్నారు.హిందూపురం జిల్లా కేంద్రం కోసం దేనికైనా సిద్దమేనని ఆయన ప్రకటించారు. హిందూపురానికి మెడికల్ కాలేజీని ఇవ్వాలని తాను వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కోరినట్టుగా చెప్పారు.  కానీ మెడికల్ కాలేజీని పెనుగొండలో ఏర్పాటు చేశారన్నారు. ఏదైనా సమస్య తన దృష్టికి వస్తే దాన్ని పరిష్కరించేందుకు తాను ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు.

కొత్త జిల్లాల్లో Sri Satyasai District జిల్లాను  రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే సత్యసాయి జిల్లాకు హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ నెలకొంది. పలు పార్టీలు కూడా ఇదే విషయమై ఆందోళనలు చేస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా  ఈ విసయమై ఇవాళ స్వయంగా ఆందోళనకు శ్రీకారం చుట్టారు. కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తూనే హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని బాలకృష్ణ డిమాండ్ చేస్తున్నారు.
పొట్టి శ్రీరాములు విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద బాలకృష్ణ కొద్దిసేపు మౌన దీక్షకు దిగారు. ఆ తర్వాత ఆయన తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు.
కొత్త జిల్లాల విషయమై ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు సాగుతున్నాయి. జిల్లా కేంద్రాలతో పాటు పలు డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు సాగుతున్నాయి. తమ ఆందోళనల అంశానికి సంబంధించి ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. అయితే ఈ వినతులపై ప్రభుత్వం ఈ నెల 26వ తేదీ తర్వాత ఏం చేయనుందోననేది స్పష్టత రానుంది. 


కొత్తగా ఏర్పాటైన జిల్లాల వివరాలు ఇవే.. 
జిల్లా పేరు                                  జిల్లా కేంద్రం
శ్రీకాకుళం                                    శ్రీకాకుళం
విజయనగరం                              విజయనగరం
మన్యం జిల్లా                                పార్వతీపురం
అల్లూరి సీతారామరాజు జిల్లా        పాడేరు
విశాఖపట్నం                               విశాఖపట్నం
అనకాపల్లి                                    అనకాపల్లి 
తూర్పుగోదావరి                            కాకినాడ
కోనసీమ                                       అమలాపురం
రాజమహేంద్రవరం                      రాజమహేంద్రవరం
నరసాపురం                                 భీమవరం
పశ్చిమగోదావరి                            ఏలూరు
కృష్ణా                                           మచిలీపట్నం
ఎన్టీఆర్ జిల్లా                               విజయవాడ
గుంటూరు                                    గుంటూరు
బాపట్ల                                          బాపట్ల
పల్నాడు                                     నరసరావుపేట
ప్రకాశం                                       ఒంగోలు
ఎస్ పీఎస్ నెల్లూరు                     నెల్లూరు
కర్నులు                                     కర్నూలు
నంద్యాల                                    నంద్యాల
అనంతపురం                             అనంతపురం
శ్రీసత్యసాయి జిల్లా                     పుట్టపర్తి
వెఎస్సార్ కడప                          కడప
అన్నమయ్య జిల్లా                     రాయచోటి
చిత్తూరు                                     చిత్తూరు
శ్రీబాలాజీ జిల్లా                          తిరుపతి
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు