తెలంగాణ సర్వే దెబ్బ: ఇక ముందు అలా చెప్పనని లగడపాటి

By Nagaraju TFirst Published Jan 30, 2019, 4:56 PM IST
Highlights


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మీడియా బలవంతంపై తిరుపతిలో కొందరిపేర్లు చెప్పానని అయితే ఆ తర్వాత తనపై కామెంట్ చెయ్యడంతో కోపంతో మరికొందరి పేర్లు చెప్పినట్లు చెప్పుకొచ్చారు. ఇకపై అలాంటివి జరగకుండా చూసుకుంటానని లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. 

ఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాను ప్రకటించిన సర్వేకు వ్యతిరేకంగా ఫలితాలు రావడంతో తనపై వచ్చిన రూమర్లపై మాజీఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలు రివర్స్ అవ్వడంతో తన క్రెడిబిలిటీ పోయిందని వాపోయారు. 

తాను ఎవరి ప్రలోభాలకు తలొగ్గి సర్వే ఫలితాలు విడుదల చేశానని వచ్చిన విమర్శలను లగడపాటి తిప్పికొట్టారు. తాను ఒక వ్యక్తికి కానీ ఒక వ్యవస్థకు కానీ ప్రలోభాలకు కానీ లొంగే వ్యక్తిని కాదన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాను నవంబర్ 11న చెప్పిన ఫలితాలు ఒకలా ఉన్నాయి ఆ తర్వాత ప్రకటించిన సర్వే ఫలితాలు వేరేలా వచ్చాయని తెలిపారు. 

తాను చెప్పినట్లు ఒక ఇండిపెండెంట్ గెలిచారు, గోషామహాల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ గెలిచారని గుర్తు చేశారు. అదే సందర్భంలో కొంత ఓటింగ్ అనేది స్తబ్ధుగా ఉందని అది ఏ పార్టీకి పడితే ఆ పార్టీ గెలుస్తుందని చెప్పానని చెప్పుకొచ్చారు. 

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి తానే ఆశ్చర్యానికి గురయ్యానని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనేక అనుమానాలు ఉన్నాయని కుండబద్దలు కొట్టారు. తాను 15 ఏళ్లుగా సర్వేలు చేపడుతున్నానని ఒక్కోసారి తప్పు అయినా తప్పు కావొచ్చన్నారు. 

తప్పు జరిగితే తప్పు జరిగిందని తాను ఒప్పుకుంటానని అందులో ఎలాంటి సందేహమే లేదన్నారు. తాను మాటపై నిలబడే వ్యక్తినని ఇతరులపై ఆధారపడే వ్యక్తిని కాదన్నారు. రాష్ట్ర విభజన జరిగితే తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పానని అన్న మాటకు కట్టుబడే ఇప్పటికీ దూరంగానే ఉన్నానని స్పష్టం చేశారు. 

ఎన్నో పార్టీలు అవకాశాలు ఇచ్చాయని, ప్రలోభాలు గురి చేశాయని అయినా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. అలాంటి వ్యక్తిని అయిన తనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

ప్రజల్లో తనపై నెగిటివ్ అభిప్రాయం ఏర్పడేలా ప్రచారం చేశారని ఇప్పటికైనా మీడియా ముందుకు రాకపోతే తాను తప్పు చేసిన వాడినవుతానేమోనని అనిపించిందన్నారు. సుప్రీంకోర్టులో వీవీ ప్యాడ్ ల అంశం పెండింగ్ లో ఉందని ఆ తర్వాత మాట్లాడదామనుకున్నామని అయితే ఆలస్యం అవుతున్న నేపథ్యంలో వివరణ ఇవ్వాల్సి వస్తోందన్నారు. 

తాను చిలక జోస్యం చెప్తున్నానని విమర్శించారని గుర్తు చేశారు. తాను ఇకపై ఎన్నికలకు ముందు ఎలాంటి ఫలితాలు చెప్పబోనని తెలిపారు. ఎన్నికలు పూర్తైన తర్వాతే ఫలితాలు వెల్లడిస్తానన్నారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మీడియా బలవంతంపై తిరుపతిలో కొందరిపేర్లు చెప్పానని అయితే ఆ తర్వాత తనపై కామెంట్ చెయ్యడంతో కోపంతో మరికొందరి పేర్లు చెప్పినట్లు చెప్పుకొచ్చారు. ఇకపై అలాంటివి జరగకుండా చూసుకుంటానని లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

తెలంగాణ అసెంబ్లీ ఫలితాలపై లగడపాటి సంచలన వ్యాఖ్యలు

లోకసభ ఎన్నికల తర్వాత వాస్తవాలు చెప్తా: తెలంగాణ సర్వేపై లగడపాటి

 

click me!