వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా పోటీ: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆడియో లీక్

By narsimha lodeFirst Published Jan 31, 2023, 2:22 PM IST
Highlights

వచ్చే ఎన్నికల్లో  తాను టీడీపీ అభ్యర్ధిగా  పోటీ చేస్తానని  కోటంరెడ్డి  శ్రీధర్ రెడ్డి చెప్పారు. ఈ విషయమై  శ్రీధర్ రెడ్డి  మాట్లాడినట్టుగా  ఉన్న ఆడియో ఒకటి  వెలుగు చూసింది.  


నెల్లూరు:  వచ్చే ఎన్నికల్లో  తాను టీడీపీ అభ్యర్ధిగా  పోటీ చేస్తానని  నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే  కోటంరెడ్డి  శ్రీధర్ రెడ్డి   చెప్పారు. తన అనుచరులతో  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడినట్టుగా  ఉన్న ఆడియో లీకైంది.  ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్  ఎన్టీవీ  ఈ విషయమై  కథనాన్ని ప్రసారం చేసింది.  

 గత కొంత కాలంగా  వైసీపీ నాయకత్వంపై  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  విమర్శలు  చేస్తున్నారు. తన ఫోన్ ను  ట్యాపింగ్  చేస్తున్నారని   శ్రీధర్ రెడ్డి చెప్పారు.  ప్రజల కోసమే  తాను  పార్టీ లైన్ కు  వ్యతిరేకంగా  మాట్లాడినట్టుగా  చెప్పారు.  వైసీపీలో  అవమానాలు భరించలేనన్నారు.   తన ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి తన వద్ద ఆధారాలున్నాయన్నారు. ఈ ఆధారాలను బయటపెడితే  ఐపీఎస్ అధికారుల ఉద్యోగాలు  పోతాయన్నారు.   తన మాటలను విశ్వసించాలని  ఆయన  కోరారు.  ఈ ఆడియో  లీక్ అంశం ప్రస్తుతం  నెల్లూరు జిల్లా వైసీపీలో  చర్చ సాగుతుంది. 

also read:కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహరం టీ కప్పులో తుఫానే: ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

ఈ ఆడియో  నిజంగా  కోటంరెడ్డి  శ్రీధర్ రెడ్డిదేనా  కాదా అనే విషయం  తేలాల్సి ఉంది.  నాలుగైదు రోజులుగా  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  వైసీపీ నాయకత్వంపై  తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.   ఈ తరుణంలో ఈ ఆడియో లీక్ కావడం  ప్రాధాన్యత సంతరించుకుంది.  కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి    ఇప్పటికే  టీడీపీ  చీఫ్ చంద్రబాబు, లోకేష్ తో కూడా చర్చించినట్టుగా ప్రచారం సాగుతుంది. ఈ ఏడాది ఆగష్టు లేదా సెప్టెంబర్ మాసంలో  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి   టీడీపీలో  చేరుతారనే  ప్రచారం సాగుతుంది.  ఇటీవల కాలంలో  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  చేసిన విమర్శలపై   పార్టీ నాయకత్వం  ఎలాంటి చర్యలు తీసుకుంటుందోననని శ్రీధర్ రెడ్డి  వేచి చూసే ధోరణితో  ఉన్నారని సమాచారం. 


 

click me!