వచ్చే ఎన్నికల్లో గుడివాడ నుండి నేనే పోటీ చేస్తా: రావి వెంకటేశ్వరరావు

By narsimha lode  |  First Published Dec 26, 2022, 2:38 PM IST


వచ్చే ఎన్నికల్లో గుడివాడ నుండి  టీడీపీ అభ్యర్ధిగా  తానే బరిలోకి దిగుతానని  మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు  చెప్పారు.  కొత్త అభ్యర్ధి గుడివాడ నుండి పోటీ చేస్తాడని కొడాలి నాని  భ్రమల్లో ఉన్నారని  ఆయన  చెప్పారు.


విజయవాడ: వచ్చే ఎన్నికల్లో గుడివాడ నుండి తానే పోటీ చేస్తానని  మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత  రావి వెంకటేశ్వరరావు  చెప్పారు.  గుడివాడలో  వంగవీటి రంగా  విగ్రహనికి  టీడీపీ నేత  రావి వెంకటేశ్వరరావు  ఇసోమవారం నాడు  నివాళులర్పించారు . అనంతరం ఆయన  మీడియాతో మాట్లాడారు.   వంగవీటి రంగా  వర్ధంతి కార్యక్రమాన్ని  గుడివాడలో  20 ఏళ్లుగా  నిర్వహిస్తున్నట్టుగా ఆయన గుర్తు  చేశారు.  కానీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించకుండా  అడ్డుకోనేందుకు  వైసీపీ ప్రయత్నించిందన్నారు.  తనకు వైసీపీ కార్యకర్తలు ఫోన్లు చేసి బెదిరించారన్నారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారని కూడా  ఆయన ఆరోపించారు.

వచ్చే ఎన్నికల్లో  కొత్త అభ్యర్ధి గుడివాడ నుండి పోటీ చేస్తాడని   కొడాలి నాని  అనుకుంటున్నారన్నారు. కానీ  తానే  గుడివాడ నుండి  పోటీ చేస్తానని రావి వెంకటేశ్వరరావు  చెప్పారు.  తన గెలుపు కోసం  కొందరు  ఎన్ఆర్ఐలు  పనిచేస్తారని  రావి వెంకటేశ్వరరావు   చెప్పారు. తమ పార్టీలో  సంగతి నీకేందుకని కొడాలి నానిని ప్రశ్నించారు  రావి వెంకటేశ్వరరావు . వంగవీటిరంగా  హత్య తర్వాత  టీడీపీ ఓటమి పాలైందన్నారు.  ఆ తర్వాత  జరిగిన ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన విషయాన్ని ఆయన  గుర్తు  చేశారు.

Latest Videos

2019 ఎన్నికల్లో  గుడివాడ అసెంబ్లీ స్థానం నుండి  దేవినేని అవినాష్  టీడీపీ అభ్యర్ధిగా  పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.  2014 ఎన్నికల్లో ఈ స్థానం నుండి  టీడీపీ అభ్యర్ధిగా  రావి వెంకటేశ్వరరావు  పోటీ చేసి  ఓటమి పాలయ్యాడు.2009 ఎన్నికల్లో  రావి వెంకటేశ్వరరావు  పీఆర్‌పీ నుండి  పోటీ చేసి ఓటమి పాలయ్యాడు . 1983, 1985 ఎన్నికల్లో  ఇదే అసెంబ్లీ స్థానం నుండి నందమూరి తారకరామారావు  పోటీ చేసి విజయం సాధించారు.  1989లో  కటారి ఈశ్వర్  కాంగ్రెస్ అభ్యర్ధిగా  పోటీ చేసి గెలుపొందారు.1994లో ఇదే  స్థానం నుండి  రావి శోభనాద్రీచౌదరి  టీడీపీ అభ్యర్ధిగా  విజయం సాధించారు. 1999లో రావి  హరిగోపాల్  టీడీపీ నుండి పోటీ చేసి గెలుపొందారు . 2000లో  జరిగిన ఉప ఎన్నికల్లో  రావి వెంకటేశ్వరరావు  టీడీపీ అభ్యర్ధిగా  పోటీ చేసి విజయం సాధించారు.2004 నుండి  ఈ అసెంబ్లీ స్థానం నుండి  కొడాలి నాని  వరుసగా విజయం సాధిస్తున్నారు.  కొడాలి నానిని ఈ స్థానంలో ఓడించాలని టీడీపీ నాయకత్వం పట్టుదలగా  ఉన్న విషయం తెలిసిందే.
 

click me!