రాజకీయాల్లోని కలుపు మొక్కలను ఏరివేస్తానని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు. సినీ రంగంలోకి ఇష్టపడి రాలేదన్నారు. రాజకీయాల్లోకి మాత్రం ఇష్టపడి వచ్చానని ఆయన చెప్పారు.
అమరావతి: సినిమా రంగంలోకి (cinema)తాను ఇష్టపడి రాలేదని జనసేన (jana sena)చీఫ్ పవన్ కళ్యాణ్ (pawan kalyan)చెప్పారు. రాజకీయాల్లోకి (politics) మాత్రం ఇష్టంతోనే వచ్చానని ఆయన తెలిపారు. రాజకీయాల్లో కలుపు మొక్కలను ఏరివేస్తానని ఆయన చెప్పారు. తన వ్యవసాయ క్షేత్రంలో కలుపు మొక్కలను ఏరివేయడం తనకు ఇష్టమన్నారు. అదే తరహాలో రాజకీయాల్లో కలుపు మొక్కలను ఏరివేస్తానని ఆయన చెప్పారు.
also read:నన్ను గెలిపించండి అభివృద్ది చూపిస్తా, వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారుతుంది: పవన్ కళ్యాణ్
బుధవారం నాడు జనసేన (jana sena) చీఫ్ పవన్ కళ్యాణ్ (pawan kalyan ) మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తన 15 ఏళ్ల వయస్సులో ఆద్యాత్మిక వైపు వెళ్లే క్రమంలో ఇంట్లో వాళ్లు తిడితే తాను సినీ పరిశ్రమలోకి వచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకొన్నారు. సినిమా అంటే ఇష్టమేనని గత్యంతరం లేకనే తాను సినీ రంగంలోకి వచ్చానని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇప్పటివరకు తాను సామాజిక కార్యకర్తగానే పనిచేశానని ఆయన చెప్పారు. ఇక నుండి రాజకీయాలు చేస్తానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
పక్కవాడికి అన్యాయం జరిగితే స్పందించే గుణం తనకు ఉందన్నారు. ఈ కారణంగానే రాజకీయాల్లో వచ్చినట్టుగా చెప్పారు. తాను ఏనాడూ కూడ లైన్ దాటి మాట్లాడనని పవన్ కళ్యాణ్ చెప్పారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి తాను ప్రశ్నిస్తే తన వ్యక్తిగత జీవితంపై మాట్లాడుతున్నారన్నారు.