పవన్ పర్యటనలో జేబుదొంగల చేతివాటం

Published : Jun 26, 2019, 02:01 PM IST
పవన్ పర్యటనలో జేబుదొంగల చేతివాటం

సారాంశం

తమ అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ దేవాలయంకు రావడంతో పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడకు చేరుకున్నారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో జేబు దొంగలు తమ చేతివాటానికి పనిచెప్పారు. దేవాలయ నిర్వాహకుడు జేబులో నుంచి రూ.25వేలు కొట్టేశారు. 

గుంటూరు: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనలో జేబుదొంగలు హల్ చల్ చేశారు. బుధవారం ఉదయం గుంటూరు జిల్లాలోని దశావతారం వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు పవన్ కళ్యాణ్. 

తమ అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ దేవాలయంకు రావడంతో పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడకు చేరుకున్నారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో జేబు దొంగలు తమ చేతివాటానికి పనిచెప్పారు. 

దేవాలయ నిర్వాహకుడు జేబులో నుంచి రూ.25వేలు కొట్టేశారు. అంతేకాదు మరికొంతమంది జేబులు కూడా కొట్టేశారు. జేబు దొంగల చేతివాటానికి బలైన బాధితులు బోరున విలపించారు. 

దశావతాం వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు ఆలయం వద్దకు వచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్ కు దేవాలయ అధికారులు, ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో పవన్ కు స్వాగతం పలికారు. పూజలు అనంతరం పవన్ విజయవాడలోని నివాసానికి వెళ్లిపోయారు. 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : తెలంగాణపై చలి పంజా.. ఈ జిల్లాల్లో వచ్చే పదిరోజులు అత్యల్ప ఉష్ణోగ్రతలు
Scrub Typhus : తెలుగు రాష్ట్రాల్లో కొత్త వ్యాధి.. ఏమిటిది, ఎలా సోకుతుంది, లక్షణాలేంటి?