చీమల మందు తాగి భార్య ఆత్మహత్యాయత్నం.. తన మీద ఫిర్యాదు చేసిందని రైలు కిందపడి భర్త ఆత్మహత్య..

By AN TeluguFirst Published Nov 19, 2021, 10:08 AM IST
Highlights

ఈ నెల 17న భార్యభర్తల మద్య గొడవ రావడంతో జ్యోతి చీమలమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. దీంతో చికిత్స అనంతరం కోలుకున్న ఆమె.. తనను భర్త హింసిస్తున్నాడంటూ 100కు ఫోన్ చేయడంలో రూరల్ పోలీసులు బాలరాజును విచారణ కోసం పోలీస్ స్టేషన్ కు రావాలని సమాచారం ఇచ్చారు. దీంతో మనస్తాపం చెందిన బాలరాజు....

ఏలూరు : భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిందని మనస్తాపానికి గురైన భర్త రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా గణపవరానికి చెందిన బాలరాజుకు (30)ఏలూరు శివారు చొదిమెళ్లలో ఉంటున్న జ్యోతికి కొంతకాలం కిందట వివాహమయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు. కూలి పనులు చేసుకుంటూ బాలరాజు కుటుంబాన్ని పోషిస్తున్నాడు. 

అత్తింట్లో బంధువు చనిపోవటంతో రెండు వారాల కిందట చొదిమెళ్లకు పిల్లలో సహా వచ్చారు. ఈ నెల 17న భార్యభర్తల మద్య conflict రావడంతో జ్యోతి చీమలమందు తాగి suicide attemptకి పాల్పడింది. ఇది గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. దీంతో చికిత్స అనంతరం కోలుకున్న ఆమె.. తనను భర్త harrassement చేస్తున్నాడంటూ 100కు ఫోన్ చేయడంలో rural policeలు బాలరాజును విచారణ కోసం పోలీస్ స్టేషన్ కు రావాలని సమాచారం ఇచ్చారు.

గురువారం జ్యోతి తన తండ్రితో స్టేషన్ కు వెళ్లగా .. బాలరాజు పవరు పేట రైల్వేస్టేషన్ సమీపంలోకి వచ్చి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రేల్వై ఎస్సై రమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ఇలాంటి ఘటనే గురువారం బీహార్ లో మరొకటి జరిగింది. ఘటన బీహార్ రాష్ట్రంలోని పశ్చిమ చంపారన్ జిల్లాలో భర్త చికెన్ వండమన్నాడని భార్య ఒంటిమీద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది.  పోలీసుల కథనం ప్రకారం.. బేతియా నగరానికి చెందిన Rahul Kumar (26)కు  పక్క గ్రామం pahadpur లో నివసించే  నాగేంద్ర సింగ్ కుమార్తె ఆర్తి దేవి (19) తో 8 నెలల క్రితం వివాహం జరిగింది.

తీరందాటిన వాయుగుండం... దక్షిణాంధ్ర, రాయలసీమలో అతిభారీ, తెలంగాణలో భారీ వర్షాలు

ఆర్తి దేవికి చిన్నప్పటి నుంచి Non-vegetarian తినడం ఇష్టం లేదు. ఎక్కువగా శాకాహారమే  తినేది. కానీ  రాహుల్ కుమార్ కు చికెన్, మటన్ అంటే చాలా ఇష్టం.  వీరిద్దరికీ వివాహమైన తర్వాత ఆర్తి దేవి మాంసాహారం వండడానికి భర్తతో తరచుగా గొడవ పడేది.  తాను తినక పోయినా భర్త సంతోషం కోసం అప్పుడప్పుడు Chicken వండేది.  

ఇదే క్రమంలో రాహుల్ కుమార్ నవంబర్ 15న ఇంటికి  చికెన్ తీసుకొచ్చి భార్యను వడ్లమన్నాడు.  ఆ రోజు Ekadashi కావడంతో ఆర్తి మాంసాహారాన్ని ముట్టుకోను అని చెప్పింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య మళ్ళీ గొడవ మొదలైంది.  ఒక వైపు రాహుల్ ఎలాగైనా ఈ రోజు చికెన్ తినాల్సిందేనని పట్టుబట్టగా, మరో వైపు ఆర్తి ఏకాదశి రోజు ఇంట్లో మాంసాహారం  వండడానికి వీలు లేదని భీష్మించుకు కూర్చుంది.

చివరికి రాహుల్కు ఏం చేయాలో తోచక ఇంటి బయట వరండాలో చికెన్ వండడం మొదలుపెట్టాడు.  ఇది గమనించిన ఆర్తి..  భర్త రాహుల్ చాలా పెద్ద తప్పు చేశాడని…  ఏకాదశి రోజు అలా చేయడం ఇంటికి అరిష్టం అని భావించిన ఆర్తిఒంటిపై Kerosene పోసుకుని నిప్పంటించుకుంది. రాహుల్ వెంటనే మంటలను ఆర్పి, ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు.  ఈ క్రమంలో భర్త రాహుల్ కూడా స్వల్పంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నవంబర్ 16న ఆర్తి ప్రాణాలు వదిలింది.  భర్త వేధింపులు కారణంగా  తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని నిందితుడిని కఠినంగా శిక్షించాలని  ఆర్తి తండ్రి నాగేంద్ర సింగ్ పోలీసులను  కోరారు.

click me!