ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు.. వరద నీటితో అతలాకుతలం అవుతున్న జిల్లాలు.. చిత్రావతి నదిలో చిక్కుకున్న కారు..

By AN TeluguFirst Published Nov 19, 2021, 9:32 AM IST
Highlights

 Kadapa Districtలోనూ వరద ఉదృతి కొనసాగుతోంది. అన్నమయ్య, ఫించ ప్రాజెక్టుల కట్టలకు గండ్లు పడ్డాయి. చెయ్యేరు నది దిగువకు లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు వదిలారు. నదీ పరివాహక ప్రాంతాలు, గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. పశువులు, వాహనాలు కొట్టుకుపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రాణనష్టం కూడా జరిగినట్టు సమాచారం. 

భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో వరద బీభత్సం కొనసాగుతోంది. అనంతపురం, కడప, నెల్లూరు, తిరుపతి వరదలకు అతలాకుతలం అవుతున్నాయి. Chitravati riverకి వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో ఓ కారు నది దాటుతుండగా మధ్యలో చిక్కుకుంది. కారులో నలుగురు వ్యక్తులు ఉన్నారు. 

విషయం తెలిసిన వెంటనే Fire crew అక్కడికి చేరుకుని జేసీబీతో కారులో ఉన్నవారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. చెన్నై కొత్తపల్లి మండలం వెల్దుర్తి గ్రామ సమీపంలో నది దాటుతుండగా నీటి ఉదృతికి కారు కొట్టుకుపోయింది. కాగా నీటి ప్రవాహం అధికం కావడంతో జేసీబీ మధ్యలోనే ఆగిపోయింది. చిత్రావతి నది వద్దకు పోలీసులు, ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. 

మరోవైపు Kadapa Districtలోనూ వరద ఉదృతి కొనసాగుతోంది. అన్నమయ్య, ఫించ ప్రాజెక్టుల కట్టలకు గండ్లు పడ్డాయి. చెయ్యేరు నది దిగువకు లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు వదిలారు. నదీ పరివాహక ప్రాంతాలు, గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. పశువులు, వాహనాలు కొట్టుకుపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రాణనష్టం కూడా జరిగినట్టు సమాచారం. 

Nelloreలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. నెల్లూరు జిల్లాలో Heavy rains కారణంగా సోమశిల జలాశయానికి వరద ఉధృతి ఎక్కువగా ఉంది. దాదాపు 3,90,000 క్యూసెక్కులకు వరద ప్రవాహం జలాశయంలోకి చేరుతోంది. దీంతో అధికారులు 11 గేట్లనుంచి 4,08,000క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద తాకిడికి Somashila ఫ్లడ్ బ్యాక్స్ దెబ్బతిన్నాయి. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో సోమశిల పరివాహక ప్రాంతాలు ప్రమాదపు అంచుల్లో ఉన్నాయి. జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ అధికారులు సోమశిల జలాశయానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Anantapur జిల్లాలోని పుట్టపర్తి వద్ద చిత్రావతి నది ఉదృతంగా ప్రవహిస్తోంది. రాయల వారి పల్లి, కోవెల గుట్టపల్లి, కర్ణాటక నాగేపల్లి వద్ద బ్రిడ్జిలపై వరద నీరు వెళ్తోంది. దీంతో రాకపోకలు స్తంభించాయి. వెంటనే అప్రమత్తమైన జిల్లా పోలీస్, రెవెన్యూ యంత్రాంగం... ప్రమాదకరస్థాయిలో వరద నీరు వస్తున్నందున నది వైపు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. 

ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతితో పాటు పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం నాడు చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ మాట్లాడారు ఎప్పటికప్పుడు చెరువులు, రిజర్వాయర్లలో నీటి మట్టాలను పరిశీలిస్తుండాలని సీఎం ఆదేశించారు. 

ఏ అవసరం ఉన్నా అడగండి: భారీ వర్షాలపై సీఎం జగన్ సమీక్ష, మూడు జిల్లాల కలెక్టర్లకు ఫోన్

ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కోరారు.అవసరమైన సిబ్బందిని అందుబాటులోకి ఉంచుకోవాలన్నారు. వైద్య , ఆరోగ్య సిబ్బంది కూడా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడా కూడా రాజీపడాల్సిన అవసరం లేదని సీఎం Ys Jagan అధికారులను ఆదేశించారు. ఏం కావాలన్నా కూడా వెంటనే అడగాలని సీఎం కోరారు. నిరంతరం తాను అధికారులకు అందుబాటులో ఉంటానని సీఎం కలెక్టర్లకు చెప్పారు. ndrf, sdrf సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. 

మూడు జిల్లాలకు  రెడ్ అలెర్ట్ : చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల కలెక్టర్లకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వాతావరణ శాఖ హెచ్చరించినట్టుగా ఈ మూడు జిల్లాల్లో heavy rains కురుస్తున్నాయి. nellore, kadapa, chittoor జిల్లాల్లో కూడా వర్షాలు జన జీవనాన్ని స్థంభింప చేశాయి.
 

click me!