ఏపీలో పడిపోయిన కరోనా కేసులు: కొత్తగా 7,796 మందికి పాజిటివ్.. తూ.గోలో అత్యధికం

Siva Kodati |  
Published : Jun 08, 2021, 05:36 PM IST
ఏపీలో పడిపోయిన కరోనా కేసులు: కొత్తగా 7,796 మందికి పాజిటివ్.. తూ.గోలో అత్యధికం

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల్లో తగ్గుదల కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 7,796 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 17,71,007కి చేరుకుంది. 

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల్లో తగ్గుదల కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 7,796 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 17,71,007కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 77 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 11,629కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి విజయనగరం 5, ప్రకాశం 7, అనంతపురం 8, తూర్పుగోదావరి 6, చిత్తూరు 12, గుంటూరు 4, కర్నూలు 3, నెల్లూరు 8, కృష్ణ 2, విశాఖపట్నం 6, శ్రీకాకుళం 7, పశ్చిమ గోదావరి 10, ప్రకాశం 4, కడపలో ఇద్దరు చొప్పున మరణించారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 14,641 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 16,51,790కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 89,732 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 1,99,46,253కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1,07,588 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 918, చిత్తూరు 1210, తూర్పుగోదావరి 1302, గుంటూరు 518, కడప 410, కృష్ణ 379, కర్నూలు 147, నెల్లూరు 311, ప్రకాశం 499, శ్రీకాకుళం 376, విశాఖపట్నం 672, విజయనగరం 299, పశ్చిమ గోదావరిలలో 755 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

 

PREV
click me!

Recommended Stories

క్షమాపణలు చెప్పిన టీడీపీ ఆర్టిస్ట్ సునీల్! | YS Bharati Video Controversy | TDP Sunil Apology
ఆ నీచానికి ఒడిగట్టింది మీరే | Perni Nani Fires On Chandrababu | Asianet Telugu