తెనాలిలో దారుణం: భార్యను చంపి పూలమాల వేసి నివాళులర్పించిన భర్త

Published : Nov 17, 2022, 04:37 PM ISTUpdated : Nov 17, 2022, 05:00 PM IST
తెనాలిలో  దారుణం: భార్యను  చంపి పూలమాల వేసి  నివాళులర్పించిన భర్త

సారాంశం

కుటుంబ కలహలతో  భార్యను భర్త  హత్య చేశాడు. భార్యను  హత్య చేసిన  తర్వాత  అతను  పోలీసులకు  లొంగిపోయాడు. 

గుంటూరు: కుటుంబ కలహలతో  భార్యను  హత్య చేశాడు భర్త. భార్య  డెడ్ బాడీపై పూలమాలవేసి  నివాళులర్పించి  పోలీసులకు లొంగిపోయాడు  నిందితుడు.ఈ  ఘటన  గుంటూరు  జిల్లా  తెనాలిలో  గురువారంనాడు జరిగింది.తెనాలిలోని  గాంధీనగర్  లో  స్వాతి  బ్యూటీపార్లర్ నడుపుతుంది. ఆమె  భర్త కోటేశ్వరరావు.  కోటేశ్వరరావు.కు  అప్పులయ్యాయి.  ఈ  అప్పులు తీర్చడానికి  తన భార్య  స్వాతి  పేరున  ఉన్న  భూమిని  విక్రయించాలని నాగేశ్వరరావు  కోరుతున్నాడు. అయితే భార్య  మాత్రం  ఇందుకు  అంగీకరించలేదు. దీంతో ఆరు మాసాలుగా  భార్య  భర్తల మధ్య  ఘర్షణలు  జరుగుతున్నాయి. ఇవాళ  బ్యూటీపార్లర్  లో ఎవరూ  లేని  విషయాన్ని  గుర్తించిన  భర్త కోటేశ్వరరావు. బ్యూటీపార్లర్ కు  వచ్చాడు.  భార్యతో  గొడవ పడ్డాడు.  భార్యను  హత్య  చేశాడు. వచ్చే  సమయంలో  తన వెంట  తెచ్చుకున్న  పూలమాలను  భార్య  డెడ్  బాడీపై  ఉంచి  నివాళులర్పించారు. అనంతరం  పోలీసులకు  లొంగిపోయాడు.స్వాతి,  కోటేశ్వరరావు. దంపతులకు  ఇద్దరు కొడుకులు. తల్లి  చనిపోవడం, తండ్రిని  పోలీసులు  అరెస్ట్ చేయడంతో పిల్లలు  అనాథలుగా మారారు. 

రెండు  రోజుల క్రితం  స్వాతిని  కోటేశ్వరరావు  కొట్టాడని  తల్లి  మీడియాకు చెప్పింది.  ఈ  విషయం తెలిసి తాము  తమ  కూతరిని  తమ  ఇంటికి  తీసుకెళ్లినట్టుగా  చెప్పారు. భర్త  కొట్టిన  విషయమై  స్వాతి  పోలీసులకు  పిర్యాదు  చేసిందన్నారు. నిన్న  బ్యూటీపార్లర్  వద్దకు  తాను  కూడా  వచ్చినట్టుగా స్వాతి  తల్లి  చెప్పారు. కోటేశ్వరరావు వస్తే  ఫోన్  చేయాలని  కానిస్టేబుల్  నెంబర్ కూడా  ఉందన్నారు. కానీ ఇవాళ  కోటేశ్వరరావు  వచ్చి హత్య చేసి  వెళ్లిపోయాడని  స్వాతి తల్లి  చెప్పారు. 

తన  బిడ్డ పేరున  ఉన్న  స్థలం  విక్రయించాలని కోటేశ్వరరావు  చాలా  రోజులుగా వేధిస్తున్నాడని ఆమె  చెప్పారు. తన కూతురు  బ్యూటీపార్లర్ నడిపితేనే  వచ్చే  డబ్బులతోనే  ఇల్లు  గడుస్తుందని  స్వాతి  తల్లి  మీడియాకు  తెలిపారు.  స్వాతిని  హత్య చేసేందుకు  దారి తీసిన పరిస్థితులపై  కోటేశ్వరరావును  పోలీసులు  ప్రశ్నిస్తున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Reddappagari Madhavi Reddy Satirical Comments On YSRCP Party | Asianet News Telugu
School Holidays : తెలుగు స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.. ఇలా స్కూళ్లు రీఓపెన్ కాగానే అలా సెలవులు.. ఎన్నిరోజులో తెలుసా?