అనారోగ్యంతో భార్య మరణం... తట్టుకోలేక భర్త ఆత్మహత్య

sivanagaprasad kodati |  
Published : Jan 30, 2019, 08:06 AM IST
అనారోగ్యంతో భార్య మరణం... తట్టుకోలేక భర్త ఆత్మహత్య

సారాంశం

కష్టసుఖాల్లో తనకు తోడుగా ఉన్న భార్య మరణాన్ని తట్టుకోలేక ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. విజయవాడ రామవరప్పాడుకు చెందిన గొట్టిపాటి నాగ మురళీకృష్ణ స్థానికంగా ఉన్న ఓ ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నాడు.

భార్యతో కలిసి గోలి కృష్ణయ్య వీధిలో నివాసం ఉంటున్నాడు. కాగా, ఈ దంపతులకు సంతానం లేదు. దీనికి తోడు మురళీకృష్ణ భార్య స్రవంతి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం స్రవంతి ఎంతకు నిద్ర లేవకపోవడంతో ఆమెను కదిపి చూశాడు.

అప్పటికే ఆమె చనిపోయింది.. భార్య మరణాన్ని తట్టుకోలేక, ఇక తనకు ఎవరు లేరని భావించిన మురళీకృష్ణ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లోంచి ఎవరు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన చుట్టుపక్కల వారు తలుపుకొట్టి చూశారు.

ఎటువంటి స్పందనా లేకపోవడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి చూడగా బెడ్‌పై స్రవంతి నిర్జీవంగా పడివున్నారు.

పక్కనే సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ మురళీ కనిపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దంపతుల మరణంతో కాలనీలో విషాద వాతావరణం నెలకొంది.
 
PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు