Bheemla Nayak: ఏపీలో కేసీఆర్ భారీ ఫ్లెక్సీ.. హ్యాట్సాఫ్ సీఎం సర్ అని అభిమానాన్ని చాటుకున్న ఫ్యాన్స్

Published : Feb 26, 2022, 11:04 AM IST
Bheemla Nayak: ఏపీలో కేసీఆర్ భారీ ఫ్లెక్సీ.. హ్యాట్సాఫ్ సీఎం సర్ అని అభిమానాన్ని చాటుకున్న ఫ్యాన్స్

సారాంశం

సినీ ప్రేక్షకులు చాలా రోజులుగా ఎదురుచూసిన పవర్ స్టార్ చిత్రం Bheemla Nayak శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. మంచి హిట్ టాక్‌తో ఈ చిత్రం దూసుకుపోతుంది. అయితే బీమ్లా నాయక్ చిత్రం విడుదల సందర్భంగా విజయవాడలో ఏర్పాటైన ఓ ఫ్లెక్సీ ఇప్పుడు అందరి దృష్టిని ఆకరిస్తుంది. 

సినీ ప్రేక్షకులు చాలా రోజులుగా ఎదురుచూసిన పవర్ స్టార్ చిత్రం “భీమ్లా నాయక్” శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. మంచి హిట్ టాక్‌తో ఈ చిత్రం దూసుకుపోతుంది.  Bheemla Nayak సినిమాకు ప్రేక్షకుల నుంచి, విమర్శకుల నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ప్రస్తుతం థియేటర్లలో బీమ్లా నాయక్ చిత్రం సందడి చేస్తుంది. అయితే ఈ చిత్ర బృందం విజ్ఞ‌ప్తి మేర‌కు తెలంగాణలో బీమ్లా నాయక్ చిత్రానికి బెనిఫిట్ షోలకు, రోజుకు ఐదు షోలకు అనుమతి లభించింది. ఇటీవల జరిగిన బీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన మంత్రి కేటీఆర్, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని కూడా తెలుగు చిత్ర పరిశ్రమకు, భారత చిత్ర పరిశ్రమకు హైదరాబాద్ నగరాన్ని ఒక సుస్థిరమైన కేంద్రంగా అభివృద్ధి చేయాలనేదే తమ లక్ష్యం అని చెప్పారు. 

మరోవైపు ఏపీలో మాత్రం బీమ్లా నాయక్ చిత్రంపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఏపీలోని ప‌లు సినిమా థియేట‌ర్ల‌కు జగన:్ స‌ర్కారు ముంద‌స్తు నోటీసులు జారీ చేసింది. బెనిఫిట్ షోలు, అద‌న‌పు షోలు వేయ‌డానికి వీల్లేద‌ని స్పష్టం చేసింది. నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని కూడా నోటీసుల్లో పేర్కొంది. అయితే దీనిపై పవన్ అభిమానులు మండిపడుతున్నారు. పలుచోట్ల రోడ్లపైకి చేరి తమ నిరసనను కూడా వ్యక్తం చేస్తున్నారు. 

అయితే బీమ్లా నాయక్ చిత్రం విడుదల సందర్భంగా విజయవాడలో ఏర్పాటైన ఓ ఫ్లెక్సీ ఇప్పుడు అందరి దృష్టిని ఆకరిస్తుంది. బీమ్లా నాయక్ చిత్రం విడుదల సందర్భంగా ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలో.. పవన్‌కు ఓ వైపు సీఎం కేసీఆర్, మరోవైపు వంగవీటి మోహనరంగా ఫొటోలను ఉంచారు. అంతేకాకుండా పై భాగంలో తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని, జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ చిత్రాలను ఉంచారు. ఇంకా ఆ ఫ్లెక్సీలో హ్యాట్సాఫ్ సీఎం సర్ అని కూడా రాసి ఉంచారు. 

 

కృష్ణలంక 21వ డివిజన్ ఫ్రెండ్స్ సర్కిల్ పేరుతో ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. విజయవాడ కృష్ణలంకలోని ఫైర్ స్టేషన్ సమీపంలో ఏర్పాటైన ఈ భారీ ఫ్లెక్సీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ టిక్కెట్ ధరలు, ఐదో షోకు అనుమతులు ఇవ్వడాన్ని స్వాగతిస్తూ పవన్ అభిమానులు కేసీఆర్ మీద తమ అభిమానాన్ని చాటుకున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?