మిజోరాం సరిహద్దుల్లో తలనీలాలు పట్టివేత.. అవి టీటీడీవి కావు: కస్టమ్స్ ప్రకటన

Siva Kodati |  
Published : Mar 30, 2021, 10:26 PM ISTUpdated : Mar 30, 2021, 10:27 PM IST
మిజోరాం సరిహద్దుల్లో తలనీలాలు పట్టివేత.. అవి టీటీడీవి కావు: కస్టమ్స్ ప్రకటన

సారాంశం

మిజోరాంలో పట్టుబడిన తలనీలాలు టీటీడీకి చెందినవి కావని కస్టమ్స్ శాఖ రిపోర్ట్ ఇచ్చింది. ఐజ్వాల్ నుంచి మయన్మార్‌కు అక్రమంగా తలనీలాలు వెళ్తున్నట్లు గుర్తించారు అధికారులు

మిజోరాంలో పట్టుబడిన తలనీలాలు టీటీడీకి చెందినవి కావని కస్టమ్స్ శాఖ రిపోర్ట్ ఇచ్చింది. ఐజ్వాల్ నుంచి మయన్మార్‌కు అక్రమంగా తలనీలాలు వెళ్తున్నట్లు గుర్తించారు అధికారులు.

దాదాపు 3,240 కేజీల తలనీలాలను అస్సాం రైఫిల్స్ స్వాధీనం చేసుకుంది. గత నెల 7న మిజోరాంలోని చుంగ్టే వద్ద స్మగ్లింగ్ చేస్తున్న తలనీలాలను సీజ్ చేశాయి. స్మగ్లర్ల నుంచి తలనీలాలు, లారీలను స్వాధీనం చేసుకున్నాయి అస్సాం రైఫిల్స్.

అయితే ఇవి టీటీడీకి చెందినవేనంటూ ప్రచారం జరిగింది. అయితే అవి తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినవి కావని కస్టమ్స్ తన రిపోర్ట్‌లో పేర్కొంది. ఏపి నుంచి రూ. 18 లక్షల విలువైన తలనీలాలు తరలించే అవకాశం లేనట్లేనని కస్టమ్స్ పేర్కొంది.

మయన్మార్, మిజోరాం మధ్య ఫ్రీ మూవ్‌మెంట్ ఏరియా వుంది. 20 కి.మీ పరిధిలో పాస్‌పోర్ట్, వీసా లేకుండా ప్రయాణం చేసే అవకాశం వుంది. ఈ ప్రాంతం గుండా మయన్మార్ దేశానికి అక్రమంగా తలనీలాల తరలింపు జరిగింది. 

మిజోరం సమీపంలోని మయన్మార్ సరిహద్దులో పోలీసులు సీజ్ చేసిన 120 బ్యాగుల తలనీలాలు ( వెంట్రుకలతో) తమకు ఎలాంటి సంబంధం లేదని టీటీడీ మంగళవారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

టీటీడీ తన వద్ద ఉన్న తలనీలాలను ఈ ప్లాట్ఫామ్ ద్వారా అంతర్జాతీయ టెండర్ల ద్వారా విక్రయిస్తుంది. టెండర్ లో ఎక్కువ మొత్తం కోట్ చేసిన బిడ్డర్ నుంచి జిఎస్ టి కట్టించుకుని తలనీలాలు అప్పగిస్తారు. 

కొనుగోలు చేసిన బిడ్డర్ కు అంతర్జాతీయ ఎగుమతి అనుమతులు ఉన్నాయా ? లేక దేశంలోనే ఏ ప్రాంతంలో విక్రయిస్తారనేది టీటీడీకి సంబంధించిన విషయం కాదు.

దేశంలోని అనేక ఆలయాలలో తలనీలాల విక్రయాలు జరుగుతూ ఉంటాయి. అలాగే టీటీడీ కూడా ప్రతి మూడు నెలలకోసారి ఈ టెండర్ ద్వారా తలనీలాలు విక్రయిస్తుంది. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ.

సంబంధిత అధికారులు తలనీలాల అక్రమ రవాణాకు పాల్పడిన సంస్థల పేర్లు అధికారికంగా తెలియజేస్తే బ్లాక్ లిస్ట్ లో పెడతాం అని టీటీడీ ప్రజాసంబంధాల అధికారి ఓ ప్రకటనలో తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్