విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన భారీ పెట్టే.. (వీడియో)

By SumaBala Bukka  |  First Published Sep 30, 2023, 10:28 AM IST

విశాఖ వైఎంసిఏ బీచ్ కు ఓ అరుదైన పెద్ద పెట్టె  కొట్టుకువచ్చింది. దీన్ని చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. 


విశాఖ పట్నం : విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన భారీ పెట్టే. కెరటాల దాటికి ఒక దగ్గర స్టక్ అయ్యింది. దాన్ని ప్రొక్లెయినర్ సహాయంతో బైటికి తీసుకువచ్చారు. బోట్లను లంగర్ వేయడానికి.. బోట్లు ఒకదానికొకటి కొట్టుకోకుండా ఉండడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థలో భాగంగా ఉండొచ్చని స్థానికులు, పోలీసులు అనుమానిస్తున్నారు.

 

Latest Videos

బ్రిటిష్ కాలంనాటిదిగా ఈ పెట్టెను అనుమానిస్తున్నారు. ఆర్కియాలజీ సిబ్బంది దీన్ని నిర్థారించాల్సి ఉంది. అయితే, ఈ పెట్టెను బైటికి తీసుకువచ్చిన ప్రొక్లెయినర్ డ్రైవర్ మాట్లాడుతూ.. ఈ పెట్టె టన్ను పైగా బరువు ఉందని తెలిపాడు. ఈ పెట్టె మీద ఇనుపఆచ్చాదనం ఉంటుందని.. అది కొట్టుకుపోయి ఉండొచ్చని అన్నాడు. ఈ పెట్టె తీరానికి దగ్గర్లో, రాళ్ల దగ్గర స్టక్ అయ్యిందని.. అర్థరాత్రి కొట్టుకురావడంతో.. తెల్లారితే ఇబ్బంది అవుతుందని రాత్రే తీరానికి చేర్చామని చెప్పాడు.

కాగా, కాసేపట్లో విశాఖ బీచ్ కు ఆర్కియాలజీ సిబ్బంది, పోలీసులు చేరుకోనున్నారు. వీరు వచ్చిన తరువాత కానీ మరిన్ని విషయాలు తెలయవు. 

click me!