తిరుమలకు భక్తులు పోటెత్తారు. వంెకన్న దర్శనం చేసుకోవాలంటే 30 గంటల సమయం పడుతుంది. క్యూ లైన్లలో ఉన్న భక్తులకు ఆహార సదుపాయాలను టీటీడీ అధికారులు ఏర్పాటు చేశారు.
తిరుపతి: Tirumalaకు భక్తులు పోటెత్తారు. దీంతో Blaajiదర్శనం చేసుకోవడానికి 30 గంటల సమయం పడుతుంది. వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో Devotees పెద్ద ఎత్తున తిరుమలకు వచ్చి ఉంటారని TTD అధికారులు అభిప్రాయపడుతున్నారు. శనివారం నాడు ఒక్కసారిగా భక్తులు వెంకన్న దర్శనం కోసం తిరుమలకు వచ్చారు.దీంతో తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడిపోతుంది. దీంతో వెంకటేశ్వరస్వామని దర్శించుకొనేందుకు 30 గంటల సమయం పడుతుంది. తిరుమలలోని నారాయణగిరి కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. ఈ కంపార్ట్ మెంట్లలో సుమారు మూడు కిలోమీటర్ల మేర భక్తులు క్యూ లైన్లలో స్వామి వారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు.
భక్తులు పోటెత్తడంతో ఎలాంటి ఇబ్బందులు రాకుండా టీటీడీ అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం క్యూలైన్లలోకి చేరుకుంటున్న భక్తులు వెంకన్నను దర్శించుకోవడానికి కనీసం రెండు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. క్యూ లైన్లలో ఉన్న భక్తులకు ఆహారం, నీటి వసతిని కల్పించారు అధికారులు. ఆదివారం నాడు రాత్రికి భక్తుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంచన వేస్తున్నారు.
undefined
ఇటు నడక మార్గం గుండా భక్తులు తిరుమలకు వస్తున్నారు. సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. అలాగే నడక మార్గంలో తిరుమలకు వస్తున్న భక్తులకు మోకాళ్లమెట్టు ప్రాంతంలో ప్రత్యేకంగా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు.
also read:నిబంధనలకు విరుద్ధంగా శ్రీవారి ఆలయంలోకి.. మంత్రి రోజా ఎస్కార్ట్ డ్రైవర్ నిర్వాకం
అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 67,949 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 39,837 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.70 కోట్లు వచ్చింది.
ఈ ఏడాది మే 29న కూడా తిరుమలకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. తిరుమలలోని కంపార్ట్ మెంట్లన్నీ కూడా భక్తులతో నిండిపోయాయి. దీంతో భక్తులు కొన్ని రోజుల పాటు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కూడా అ సమయంలో టీటీడీ అధికారులు సూచించారు.
మే చివర్లో గంటకు 8 వేల మంది భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించిన కూడా క్యూ లైన్లలో ఉన్న భక్తులు స్వామివారి దర్శనం చేసుకోవడానికి కనీసం రెండు రోజులకు పైగా సమయం పట్టింది.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా టీటీడీ ఆ సమయంలో రద్దు చేసింది. వీఐపీలకు ప్రోటోకాాల్ దర్శనాలను మాత్రమే అనుమతించారు.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది జూలై 15వ తేదీ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలపై ఆంక్షలుంటాయని టీటీడీ అధికారుల తెలిపారు.
మే మాసంలో తిరుమలకు పెద్ద ఎత్తున భక్తుల నుండి విరాళాలు వచ్చాయి. మే మాసంలో ఒక్క రోజులోనే టీటీడీకీ రూ. 10 కోట్ల విరాళాలు అందాయి. తమిళనాడుకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున స్వామి వారికి విరాళాలు ఇచ్చారు.తమిళనాడులోని తిరునెల్వేలికి చెందిన గోపాల్ బాల కృష్ణన్. వేంకటేశ్వర స్వామి భక్తుడు. ఆయన 7 కోట్ల రూపాయల విరాళం అందించారు. శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్, శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ ట్రస్ట్, బాలాజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ రీసెర్చ్ రిహాబిలిటేషన్ ఫర్ ది డిసేబుల్డ్ శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్, శ్రీ వెంకటేశ్వర సర్వ శ్రేయస్ ట్రస్ట్, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ ఇలా ఏడు ట్రస్టులకు రూ. కోటి చొప్పున మొత్తం రూ. 7 కోట్ల విరాళం అందజేశారు.