విశాఖపట్నంలో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడిన అగ్నికీలలు

By telugu news teamFirst Published Jan 28, 2021, 8:52 AM IST
Highlights

దాదాపు 10 కోట్ల రూపాయల మేరకు ఆస్తినష్టం జరిగి ఉంటుందని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మంటలు ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

విశాఖ జిల్లా గాజువాకలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.  ఓ కంపెనీలో అగ్నిప్రమాదం సంభవించింది. గాజువాక నియోజకవర్గంలోని ఆగనంపూడి పరిధిలో ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్కులోని పారామౌంట్ ఆగ్రో ఇండస్ట్రీస్ (Paramount Agro Industries) అనే కంపెనీ ఉన్న సంగతి తెలిసిందే. ఆ కంపెనీలో బుధవారం రాత్రి ఆగ్నిప్రమాదం సంభవించింది. ఆయిల్ ను నిల్వచేసే కేంద్రం వద్ద నుంచి మంటలు ఎగిసిపడినట్లు తెలుస్తోంది.

 ఫైర్ ఇంజిన్లు రంగంలోకి దిగి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. మంటలు ఏమాత్రం అదుపులోకి రాలేదు. అయితే ఘటన జరిగిన సమయంలో సిబ్బంది ఎవరూ లోపల లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. దీంతో ప్రాణనష్టం తప్పిపోవడంతో కంపెనీ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది.

 దాదాపు 10 కోట్ల రూపాయల మేరకు ఆస్తినష్టం జరిగి ఉంటుందని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మంటలు ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

కాగా.. విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గంలో ఆగనంపూడి ఏపీఐఐసీ పారామౌంట్ ఆగ్రో సన్ లియో ఆయిల్ కంపెనీలో భారీగా అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న దువ్వడా సర్కిల్ ఇన్సెపెక్టర్ శ్రీమతి టి.లక్ష్మీ గారు క్షణాల్లో చేరుకొని పరిస్థిని అదుపులోకి తీసుకొచ్చారు.

ఇప్పటి వరకు 3 ఫైర్ ఇంజిన్లు వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.. సీఐ గారు వెంటనే స్పందించడం వల్లనే ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టం మాత్రమే జరిగింది..రాత్రి 11:30 అవుతున్న కూడా మంటలు కొద్దికొద్దిగా తీవ్రత తగ్గుముఖం పట్టాయి.. స్థానికులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో సీఐ లక్ష్మీ గారు ఆందోళన చెందవద్దని పరిస్థితి అడుపులోనే అన్నదని చుట్టూ ప్రక్కల గ్రామస్థులకు ధైర్యం నింపారు.

క్షణాల్లో స్పందించిన సీఐ లక్ష్మీ గార్కి ఆగనంపూడి ఏపీఐఐసీ ఇండస్ట్రీస్ ప్రతినిధులు, చుట్టూ ప్రక్కల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ పోలీసులుకు అభినందనలు తెలియజేశారు.

ఇదిలా ఉండగా గతేడాది మే నెల ఏడో తారీఖున విశాఖ జిల్లాలోనే ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీక్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనను రేకెత్తించింది. రెండు గ్రామాలు ఈ ఘటన వల్ల తీవ్రంగా ప్రభావితం చెందాయి. పదకొండు మంది ఈ ప్రమాదం బారిన పడి చనిపోయారు. వందలాది మంది తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.

గ్యాస్ ప్రభావానికి లోనై మనుషులంతా ఎక్కడికక్కడ పడిపోయారు. పశువులు, పక్షులు, చివరకు తాగే నీరు కూడా గ్యాస్ ప్రభావానికి గురయ్యాయి. ఘటన జరిగిన తర్వాత అత్యంత వేగంగా స్పందించిన ఏపీ సర్కారు, బాధితులను ఆదుకోవడంలో కూడా ఉదారతను చాటుకుంది. ఈ ఘటన వల్ల మరణించిన వారి కుటుంబాలకు కోటి రూపాయల పరిహారాన్ని అందజేయడం గమనార్హం.

click me!