ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం: లోక్‌సభలో ప్రస్తావించిన నాని

Published : Nov 18, 2019, 11:54 AM ISTUpdated : Nov 18, 2019, 12:12 PM IST
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం: లోక్‌సభలో ప్రస్తావించిన నాని

సారాంశం

ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ భాషల అభివృద్ది కోసం కేంద్రం  ఏ రకమైన చర్యలు తీసుకొంటుందో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రశ్నించారు. 

న్యూఢిల్లీ: ప్రాంతీయ భాషల పరిరక్షణ కోసం ప్రభుత్వం ఏం చేస్తోందని టీడీపీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒకే భాష మాట్లాడేవారంతా ఒకే రాష్ట్రంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన విషయాన్ని నాని గుర్తు చేశారు.

Also read:పేద, ధనిక అంతరాన్ని తగ్గించడానికే ఆ పథకం: కన్నబాబు

సోమవారం నాడు పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన వెంటనే టీడీపీ ఎంపీ కేశినేని నాని ఏపీ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియాన్ని అమలు చేసిన విషయాన్ని నాని ప్రస్తావించారు. ప్రాంతీయ భాషల పరిరక్షణ కోసం ప్రభుత్వం ఏం చర్యలు తీసుకొంటుందో చెప్పాలని కేశినేని నాని కేంద్రాన్ని ప్రశ్నించారు.

రాష్ట్రాల్లో వాడుక భాష లేదా భాషలను ప్రమోట్ చేసేందుకు ప్రభుత్వం తీసుకొంటున్న చర్యల గురించి  ప్రశ్నించారు.  ఆయా రాష్ట్రాల ప్రజల సంస్కృతులు, సంప్రదాయాలను కాపాడాల్సిన అవసరం ఉందని  విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రభుత్వాన్ని కోరారు.

read more అధికారంలోకి వస్తూనే దోపిడికి ప్లానింగ్.. జే ట్యాక్స్ అమలు: జగన్‌పై చంద్రబాబు ఫైర్

తెలుగు భాష ఉన్నతి కోసం కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకొంటుందని  కేంద్ర మంత్రి పోక్రియాల్ ప్రకటించారు.  ఏపీ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని కచ్చితంగా అమలు చేయడంపై ఏపీలో విపక్షాలు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే ప్రభుత్వం మాత్రం తాము తీసుకొన్న నిర్ణయాన్ని తప్పుబడుతుంది. పేద ప్రజలకు చెందిన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకోకూడదా అని ప్రశ్నిస్తోంది. ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకిస్తున్న నేతలంతా  తమ పిల్లలను తమ కుటుంబ సభ్యుల పిల్లలను ఎక్కడ చదివిస్తున్నారని ఎదురు దాడికి దిగింది.ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోదన విషయమై  అధికార వైసీపీ, విపక్షాల మధ్య మాటల యుద్దం సాగుతోంది. 

PREV
click me!

Recommended Stories

Tirumala Vaikunta Dwaram: టికెట్ లేని భక్తులకు ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు| Asianet News Telugu
ఫ్యూచర్ కోసం ఈ ఏడాది రిజల్యూషన్ తీసుకుందాం: Doctor Ratna Pemmasani | Plastic | Asianet News Telugu