Operation Royal vasista: ధర్మాడి సత్యం బీ ప్లాన్ సక్సెస్, బోటు ఎలా తీశారంటే..

By narsimha lodeFirst Published Oct 22, 2019, 4:01 PM IST
Highlights

తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం-కచ్చులూరు మధ్య గోదావరి నదిలో మునిగిపోయిన రాయల్ వశిష్టబోటును  ధర్మాడి సత్యం బోటును ప్లాన్ బీ ప్రకారంగా వెలికితీశారు. ఈ బోటును 38 రోజుల తర్వాత వెలికితీశారు. 

దేవీపట్నం: తూర్పు గోదావరి జిల్లాలోని దేవీపట్నం- కచ్చులూరు వద్ద  గోదావరి నదిలో మునిగిపోయిన బోటును మంగళవారం నాడు ధర్మాడి సత్యం బృందం వెలికి తీసింది. 

ఈ ఏడాది సెప్టెంబర్ 15వ తేదీన పాపికొండలు వెళ్తుండగా రాయల్ వశిష్ట పున్నమి బోటు కచ్చులూరు వద్ద మునిగిపోయింది. బోటు చుట్టూ ఇనుప రోప్‌లను  తగిలించి ప్రొక్లెయినర్ తో గోదావరి ఒడ్డుకు లాగుతున్నారు.

Also read:operation royal vasista: బోటును వెలికి తీసిన ధర్మాడి సత్యం టీమ్

38వ రోజున రాయల్ వశిష్ట బోటును గోదావరి ఒఢ్డుకు తీసుకొచ్చారు.   బోటులోనే మరికొన్ని మృతదేహాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు. బోటును ఒడ్డుకు లాగే క్రమంలో రెండు మృతదేహాలు బోటులో కన్పించాయి.

ధర్మాడి సత్యం బృందంతో పాటు డీప్ వాటర్ డైవర్లు కీలక పాత్ర పోషించారు. విశాఖకు చెందిన  ఓం శివశక్తి అండర్ వాటర్ సర్వీసెస్ చెందిన డ్రైవర్లు నాగరాజు, స్వామి అనే ఇద్దరు గోదావరి నదిలో మునిగిన బోటుకు మంగళవారం నాడు  లంగర్ వేశారు.

అండర్ వాటర్ డైవర్లు  మూడు చోట్ల  లంగర్లు వేశారు. బోటు ముందు భాగంతో పాటు వెనుక భాగానికి లంగర్లు వేశారు. ప్లాన్ ఏ  ప్రకారంగా ధర్మాడి సత్యం బృందం బోటును వెలికితీసేందుకు ప్రయత్నించింది.కానీ ఈ ప్లాన్ సక్సెస్ కాలేదు.

Also read:బోటు వెలికితీత: నదీగర్భంలోకి దూసుకెళ్లిన గజఈతగాళ్లు.. పాప మృతదేహం లభ్యం

దీంతో ప్లాన్ బి ను అమలు చేశారు.ఈ ప్లాన్ ప్రకారంగా లంగరు ద్వారా బోటును లాగారు. అయితే సోమవారం నాడు బోటు పై భాగం మాత్రం బయటకు వచ్చింది. మంగళవారం నాడు  ఉదయం నుండి  ధర్మాడిసత్యం  బృందం తీవ్రంగా ప్రయత్నించింది.

Also read:బోటు మునక: గోదావరిలో కొనసాగుతున్న ఆపరేషన్ రాయల్ వశిష్ట

మంగళవారంనాడు ఉదయం నుండి కచ్చులూరు లో భారీ వర్షం కురుస్తోంది. అయినా కూడ సత్యం బృందం తమ ప్రయత్నాన్ని వదల్లేదు.  బోటుకు ముందు, వెనుక ప్రాంతాల్లో లంగరు వేసి జాగ్రత్తగా వెలికితీశారు.

ప్రమాదం జరిగిన రోజున రాయల్ వశిష్ట బోటులో 77 మంది ప్రయాణం చేసినట్టుగా రికార్డులు చెబుతున్నాయి. ఈ ప్రమాదంలో 39 మంది మృతి చెందారు.. 26 మంది ఈ ప్రమాదం నుండి సురక్షితంగా ప్రమాదం నుండి బయటకు వచ్చారు. ఇంకా 12 మృతదేహాలు లభ్యం కావాల్సి ఉంది గోదావరి నది నుండి బోటును వెలికితీసే క్రమంలో బోటులో ఐదు మృతదేహాలు బయటకు వచ్చాయి. ఇంకా ఏడు మృతదేహాలు బయటకు రావాల్సి ఉంది.ప్లాన్ బీ లో భాగంగా బోటుకు చెందిన ప్యాణ్ కు ఇనుప రోప్ ను తగిలించారు. ఈ రోప్ ద్వారా బోటును వెలికితీశారు. 
 

click me!