ఏపీలో ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీలు కోట్లల్లో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు సేకరించాయి. వైసీపీ రూ. 382.44 కోట్లు, టీడీపీ రూ. 146 కోట్లు విరాళాలు పొందాయి.
Andhra Pradesh: ఈ రోజు దేశ సర్వోన్నత న్యాయస్థానం ఎలక్టోరల్ బాండ్లపై సంచనల తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఎన్నికల బాండ్లను నిషేధిస్తూ తీర్పునిచ్చింది. 2017 నుంచి ఎలక్టోరల్ బాండ్లు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారానే రాజకీయ పార్టీలకు విరాళాలు అధికంగా అందాయి. తాజాగా వెలువరించిన తీర్పులో సుప్రీంకోర్టు వీటిని రద్దు చేసింది. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయనీ స్పష్టం చేసింది. ఈ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా క్విడ్ ప్రో కో ముప్పు ఉన్నదని, అలాగే.. పౌరుల సమాచార హక్కును ఈ స్కీం ఉల్లంఘిస్తున్నదని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలు ఎన్ని కోట్ల రూపాయాలు ఈ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు అందుకున్నాయో చూద్దాం.
ఏపీలో ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఎంత మొత్తంలో విరాళాలు అందాయి అనే కుతూహలం సహజంగా కలుగుతుంది. ఇప్పటి వరకు వైసీపీ ఈ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ. 382.44 కోట్లు పొందింది. అదే.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ రూ. 146 కోట్లు పొందింది. వూసీపీ పార్టీ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా టీడీపీ కంటే రెట్టింపు విరాళాలు పొందింది.
Also Read: INDIA Bloc: మేం కూడా ఇండియా కూటమి నుంచి తప్పుకుంటున్నాం.. లేదు.. లేదు..!
కాగా, బీఆర్ఎస్ రూ. 383 కోట్లు పొందింది. ఈ లెక్కన ఎలక్టోరల్ బాండ్ల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ అత్యధికంగా విరాళాలు సేకరించింది. ఇక జాతీయ పార్టీల విషయానికి వస్తే బీజేపీ రూ. 6565 కోట్లు, కాంగ్రెస్ రూ. 1122 కోట్లు సేకరించాయి.