ఇళ్ల పట్టాల పంపిణీపై మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం చర్చించింది. ఉగాది రోజున రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మీడియాకు తెలిపారు.
ఇళ్ల పట్టాల పంపిణీపై మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం చర్చించింది. ఉగాది రోజున రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మీడియాకు తెలిపారు.
ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోతే స్థలాలు కొనే అంశంపైనే చర్చిస్తున్నామని మంత్రి వెల్లడించారు.
ఆర్‌టీజీఎస్ నుంచి లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన జాబితాను ప్రతి జిల్లాకు పంపించామని బోస్ వెల్లడించారు. ఇన్‌కం ట్యాక్స్ కడుతున్నవారు, కరెంట్ బిల్లు చెల్లిస్తున్న వారిని లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించాల్సిందిగా సీఎం ఆదేశించినట్లుగా పేర్కొన్నారు.
కాగా గతంలో అర్బన్ హౌసింగ్ నిర్మాణంలో మొత్తం దోపిడి చేశారని.. వెయ్యి రూపాయలు దాటని వ్యయాన్ని 2 వేలకు పైగా పెంచేసి అవినీతికి పాల్పడ్డారని సీఎం జగన్ రివ్యూలో తేలింది. పేదవారి సొంతింటి కలను సాకారం చేసేందుకు ఉగాది నాడు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపడతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.