కరోనా అనుమానం.. మహిళ మృతదేహాన్ని ఆస్పత్రిలోనే వదిలేసిన బంధువులు... !

By AN Telugu  |  First Published May 3, 2021, 12:16 PM IST

కరోనా విలయతాండవం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతోంది. రోజురోజుకూ జరుగుతున్న సంఘటనలు భయంతో పాటు, ఆవేదనను కలిగిస్తున్నాయి. కరోనా వస్తే సొంతవాళ్లే పట్టించుకోని వైనం.. చనిపోతే శవాన్ని అనాథగా వదిలేస్తున్న తీరు కలచివేస్తోంది. 


కరోనా విలయతాండవం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతోంది. రోజురోజుకూ జరుగుతున్న సంఘటనలు భయంతో పాటు, ఆవేదనను కలిగిస్తున్నాయి. కరోనా వస్తే సొంతవాళ్లే పట్టించుకోని వైనం.. చనిపోతే శవాన్ని అనాథగా వదిలేస్తున్న తీరు కలచివేస్తోంది. 

అలాంటి ఓ దారుణ ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. వీరులపాడు మండలం కొనతాల పల్లి గ్రామానికి చెందిన 55 సంవత్సరాల కోట మార్తమ్మ అనే మహిళ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. 

Latest Videos

undefined

ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ఆమెను కుటుంబసభ్యులు చికిత్స కోసం నందిగామ ప్రభుత్వ హాస్పిటల్‌కు తీసుకువచ్చారు. ఆస్పత్రి సిబ్బంది మార్తమ్మకు ముందుగా కరోనా టెస్ట్ చేశారు. 

ఆ రిపోర్ట్ వచ్చే లోగా ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఇంతలోనే ఆమె మృతిచెందింది. కరోనాతోనే మృతి చెందిందని భావించిన కుటుంబసభ్యులు మార్తమ్మ మృతదేహాన్ని హాస్పిటల్ లోనే వదిలేసి వెళ్లిపోయారు.

నిన్నటినుంచి హాస్పిటల్ బెడ్ మీదే మార్తమ్మ మృతదేహం పడి ఉంది. చివరకు ఎవ్వరూ రాకపోడంతో హాస్పిటల్ సిబ్బందే ఆమె మృదేహాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona
 

click me!