నంద్యాలలో పరువుహత్య.. భర్త దగ్గరికి వెళ్లడంలేదని కూతురిని చంపి.. తల, మొండెం వేరు చేసిన తండ్రి...

Published : Feb 25, 2023, 06:47 AM ISTUpdated : Feb 25, 2023, 06:48 AM IST
నంద్యాలలో పరువుహత్య.. భర్త దగ్గరికి వెళ్లడంలేదని కూతురిని చంపి.. తల, మొండెం వేరు చేసిన తండ్రి...

సారాంశం

పెళ్లైన కూతురు భర్తను వదిలేసి వచ్చిందని పరవుపోతుందని ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. కూతుర్ని గొంతునులిమి చంపి, తలా మొండె వేరుచేసి.. అడవిలో పడేవి వచ్చాడు.. 

నంద్యాల : ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో ఓ పరువుహత్య కలకలం రేపింది. పెళ్లయిన కూతురిని దారుణంగా గొంతు నులిమి చంపి, తల, మొండెం వేరు చేశారు. ఆమె వల్ల కుటుంబం పరువు పోతుందన్న కోపంతోనే కన్నతండ్రి అతి దారుణంగా పుట్టింటికి వచ్చిన కూతురిని హతమార్చాడు. ఈ ఘటన ఏపీలోని నంద్యాల జిల్లా పాణ్యం మండలంలో జరిగింది. అయితే, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. .ఈ ఘటనకు సంబంధించి పాణ్యం ఎస్సై సుధాకర్ రెడ్డి ఈ మేరకు వివరాలు తెలియజేశారు…

పాణ్యం మండలం ఆలమూరుకు చెందిన దేవేందర్ రెడ్డి అనే వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అందులో పెద్ద కుమార్తె పేరు ప్రసన్న (21). రెండేళ్ల క్రితం ఆమెకు ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తో వివాహం నిశ్చయించి, పెళ్లి జరిపించారు. మీరు హైదరాబాదులో కాపురం పెట్టారు. పెళ్లికి ముందు ప్రసన్నకు మరో వ్యక్తితో ప్రేమ వ్యవహారం ఉంది. అతనితో సాన్నిహిత్యంగా మెలిగేది. అయితే, ఈ కారణంగానే ఈ మధ్యకాలంలో భర్త దగ్గర నుంచి పుట్టింటికి వచ్చేసిన ప్రసన్న, తిరిగి హైదరాబాదుకు వెళ్లడానికి ఇష్టపడలేదు.

స్నేహితుడి ప్రియురాలి నగ్నవీడియోలు కొట్టేసి.. బ్లాక్ మెయిల్.. యువకుడి హత్య..

పెళ్లయిన రెండేళ్లకు హైదరాబాద్ నుంచి గ్రామానికి వచ్చేసి పుట్టింట్లోనే ఉండడం.. పెళ్లికి ముందు ప్రేమ వ్యవహారం నడిపిన వ్యక్తితో సాన్నిహిత్యంగా మెలగడం, భర్త దగ్గరికి వెళ్లకపోవడం.. గమనించిన తండ్రికి ఇదంతా నచ్చలేదు. దానివల్ల తన పరువు పోతుందని ఆగ్రహించాడు. ఈ కారణంతోనే ఈనెల 10వ తేదీన తండ్రి దేవేందర్ రెడ్డి కూతురు ప్రసన్నని తమ ఇంట్లోనే గొంతు నులిమి హత్య చేశాడు.

ఆ తర్వాత మరి కొంతమందితో కలిసి కూతురు మృతదేహాన్ని నంద్యాల -గిద్దలూరు మార్గంలోని అటవీ ప్రాంతానికి కారులో తీసుకువెళ్లారు. అక్కడ  కూతురు మృతదేహం తల, మొండాన్ని వేరుచేశారు. వాటిని రెండు వేరువేరు చోట్ల పడేసి, ఇంటికి తిరిగి వచ్చేశారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లుగా ఉండిపోయాడు. ఈ నేపథ్యంలోనే క్రమం తప్పకుండా ఫోన్ చేసే మనవరాలు ప్రసన్న ఫోన్ చేయకపోవడంతో తాత శివారెడ్డి ప్రసన్న గురించి ఆరా తీశాడు.

కొడుకు దేవేందర్ రెడ్డిని అడిగితే తనకు తెలియదన్నాడు. దీంతో అనుమానం వచ్చిన శివారెడ్డి గట్టిగా నిలదీయడంతో అసలు విషయం చెప్పేసాడు. కుమార్తె చేసే పనుల వల్ల తన పరువు పోతుందన్న కోపంతో తానే చంపేసినట్లు ఒప్పుకున్నాడు.. దీంతో వెంటనే శివారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గురువారం ఈ మేరకు పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకుని దేవేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించి ప్రసన్నను ఎక్కడ పడేశారో కనుక్కున్నారు. 

ఆ ప్రాంతానికి దేవేందర్ రెడ్డిని తీసుకువెళ్లి గాలించారు. అయితే,  గురువారం రోజు మొత్తం గాలించినా.. అతను చెప్పినట్టుగా తలామొండెం ఎక్కడా దొరకలేదు. శుక్రవారం మళ్లీ గాలించారు. రెండో రోజు  ప్రసన్న శరీర భాగాలు దొరికాయి. పోస్టుమార్టం కొరకు వాటిని గవర్నమెంట్ హాస్పిటల్కు పంపించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో  స్థానికులు భయాందోళనల్లో ఉన్నారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Reviews GSDP, RTGS & Pattadar Passbooks at AP Secretariat | Asianet News Telugu
Manchu Family Visits Tirumala: తిరుమల శ్రీవారి సేవలో మంచు ఫ్యామిలీ | Asianet News Telugu