24 గంటల్లో 3,464 కోవిడ్ కేసులు: ఏపీలో మొత్తం కేసులు 18,96,818కి చేరిక

Published : Jul 02, 2021, 04:38 PM IST
24 గంటల్లో 3,464 కోవిడ్ కేసులు: ఏపీలో మొత్తం కేసులు 18,96,818కి చేరిక

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 93,759మంది శాంపిల్స్ ను పరీక్షిస్తే 3,464 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతోరాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 18,96,818కి చేరుకొంది.నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 35మంది మృత్యువాతపడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 12,779కి చేరింది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 93,759మంది శాంపిల్స్ ను పరీక్షిస్తే 3,464 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతోరాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 18,96,818కి చేరుకొంది.నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 35మంది మృత్యువాతపడ్డారు. దీంతో  రాష్ట్రంలో మొత్తం  కరోనా మరణాల సంఖ్య 12,779కి చేరింది. 

గడిచిన 24 గంటల్లో 4,284మంది కోవిడ్‌ నుంచి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 18 లక్షల 46 వేల 716 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఏపీలో ప్రస్తుతం 37,323యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,21,77,961 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. 

గత 24 గంటల్లో అనంతపురంలో130,చిత్తూరులో 597, తూర్పుగోదావరిలో667, గుంటూరులో222,కడపలో 187, కృష్ణాలో250, కర్నూల్ లో078, నెల్లూరులో262, ప్రకాశంలో 349,విశాఖపట్టణంలో 126, శ్రీకాకుళంలో109, విజయనగరంలో 90 పశ్చిమగోదావరిలో 397కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో కరోనాతో  25 మంది చనిపోయారు. చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఐదుగురు చొప్పున కరోనాతో మరణించారు. పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల్లో నలుగురు చనిపోయారు. కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో ముగ్గురి చొప్పున మృతి చెందారు. విశాఖపట్టణం, విజయనగరం జిల్లాల్లో ఇద్దరి చొప్పున చనిపోయారు. వైఎస్ఆర్ కడప, కర్నూల్, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కరి చొప్పున చనిపోయారు. దీంతో కరోనాతో మరణించిన వారి సంఖ్య 12,779 కి చేరింది.

ఏపీలో పలు జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం-1,54,228, మరణాలు 1052
చిత్తూరు-2,21,049, మరణాలు1618
తూర్పుగోదావరి-2,64,397, మరణాలు 1140
గుంటూరు -1,62,849,మరణాలు 1099
కడప -1,06,811, మరణాలు 608
కృష్ణా -1,02,168,మరణాలు 1125
కర్నూల్ - 1,22,044,మరణాలు 820
నెల్లూరు -1,27,842,మరణాలు 911
ప్రకాశం -1,21,913, మరణాలు 924
శ్రీకాకుళం-1,18,716, మరణాలు 736
విశాఖపట్టణం -1,48,911, మరణాలు 1055
విజయనగరం -80,399, మరణాలు 661
పశ్చిమగోదావరి-1,62,596, మరణాలు 1030

 

 

PREV
click me!

Recommended Stories

RK Roja Comments on TTD Chairman BR Naidu బీఆర్ నాయుడుపై ఓ రేంజ్ లో రెచ్చిపోయిన రోజా| Asianet Telugu
Tirumala Temple Reopens After Lunar Eclipse: చంద్రగ్రహణం అనంతరం తెరుచుకున్న తిరుమల | Asianet Telugu