టెన్త్, ఇంటర్ విద్యార్థులకు మార్కుల కేటాయింపు: హై పవర్ కమిటీ ఏర్పాటు చేసిన ఏపీ సర్కార్

By narsimha lode  |  First Published Jul 2, 2021, 4:16 PM IST

 రాష్ట్రంలో కరోనా కారణంగా రద్దు చేసిన టెన్త్, ఇంటర్ పరీక్షల ఫలితాలు ప్రకటించడానికి అనుసరించాల్సిన విధి విధానాల రూప కల్పనకు విశ్రాంత ఐఎఎస్ అధికారిణి ఎం. ఛాయారతన్ అధ్యక్షతన ఏపీ ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది.ఈ మేరకు గురువారంనాడు ఉత్తర్వులిచ్చింది. 


హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కారణంగా రద్దు చేసిన టెన్త్, ఇంటర్ పరీక్షల ఫలితాలు ప్రకటించడానికి అనుసరించాల్సిన విధి విధానాల రూప కల్పనకు విశ్రాంత ఐఎఎస్ అధికారిణి ఎం. ఛాయారతన్ అధ్యక్షతన ఏపీ ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది.ఈ మేరకు గురువారంనాడు ఉత్తర్వులిచ్చింది. 

also read:ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు: మంత్రి ఆదిమూలపు సురేష్

Latest Videos

ఈ కమిటీకి ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ ఎ.సుబ్బారెడ్డి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి డైరెక్టర్‌ బి.ప్రతాప్‌రెడ్డి, ప్రకాశం జిల్లా డీఈవో సుబ్బారావు సభ్యులుగా ఉంటారు. వీరితోపాటు కమిటీలో మరో ఆరుగురు నిపుణులను నియమించారు.

ఈ కమిటీ పది పరీక్ష ఫలితాలకు సంబంధించి ఏయే మార్కులను పరిగణనలోకి తీసుకోవాలో ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది. ఇంటర్మీడియెట్‌ పరీక్ష ఫలితాలకు అనుసరించాల్సిన విధివిధానాలు నిర్ణయించడానికి ఛాయారతన్‌ నేతృత్వంలోనే మరో హైపవర్‌ కమిటీని కూడా విద్యాశాఖ నియమించింది. ఈ కమిటీ సూచనల మేరకు ఇంటర్‌ ఫలితాలను ప్రకటిస్తామని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు.   

ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తామని గత మాసంలో సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం తెలిపింది. జూలై 31వ తేదీలోపుగా పరీక్ష ఫలితాలను ప్రకటించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ ఆదేశాల మేరకు ఈ నెలాఖరులోపుగా ఫలితాలు ప్రకటించేందుకు ఏపీ సర్కార్ ఈ కమిటీని ఏర్పాటు చేసింది.ఈ కమిటీ సూచనల ఆధారంగా విద్యార్థులకు మార్కులను కేటాయిస్తారు.

click me!