ఆమె ఉద్యోగానికి ఎసరు పెట్టిన వైసీపీ ఎమ్మెల్యే విడుదల రజిని ఫోన్ కాల్

Published : Oct 26, 2019, 03:05 PM IST
ఆమె ఉద్యోగానికి ఎసరు పెట్టిన వైసీపీ ఎమ్మెల్యే విడుదల రజిని ఫోన్ కాల్

సారాంశం

గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైస్సార్ సీపీ ఎమ్మెల్యే విడుదల రజిని ఫోన్ కాల్ రికార్డును బయటపెట్టిన హెచ్ఎం ధనలక్ష్మి సస్పెండ్ అయ్యారు. ఓ పాఠశాల కమిటీ వివాదం విషయంలో ఆ సంఘటన జరిగింది.

గుంటూరు: గుంటూరు జిల్లా చిలుకలూరిపేట వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు విడుదల రజిని ఫోన్ కాల్ ఓ ప్రధానోపాధ్యాయురాలి ఉద్యోగానికి ఎసరు పెట్టింది. ఎమ్మెల్యే విడుదల రజిని ఫోన్ కాల్ రికార్డును బయటపెట్టినందుకు ప్రధానోపాధ్యాయురాలిని సస్పెండ్ చేశారు. 

చిలకలూరిపేట శారదా హైస్కూల్లో విద్యా కమిటీపై వివాదం చెలరేగింది. ఈ వివాదంలో విడుదల రజిని జోక్యం చేసుకున్నారు. హెచ్ఎం ధనలక్ష్మికి ఫోన్ చేసి తొలుత వేసిన కమిటీని రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 

అదే విషయాన్ని ధనలక్ష్మి కమిటికీ తెలియజేశారు. దాంతో ఆగకుండా ఎమ్మెల్యే తనతో మాట్లాడిన వాయిస్ రికార్డును కమిటీ ముందు వినిపించారు. దానికి వైసిపి ఎమ్మెల్యే విడుదల రజిని సీరియస్ అయ్యారు. 

తన వాయిస్ రికార్డును బయటకు వినిపించడంపై ఆమె ధనలక్ష్మిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయురాలు ధనలక్ష్మిపై విద్యా శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుతో హెచ్ఎం ధనలక్ష్మిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!