తాను ఎప్పుడూ నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి ఓట్లు సంపాదించుకోలేదన్నారు. జగన్ పై తాను పూర్తిస్థాయిలో నమ్మకం ఉందని చెప్పారు. కాగా.. గన్నవరం రాజకీయ పరిణామాలపై తమ కార్యకర్తలు ఆందోళనలో ఉన్నారని చెప్పారు. కార్యకర్తల ఆవేదన తీర్చాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు.
గన్నవరం రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయి. టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జగన్ తో భేటీ తర్వాత గన్నవరంలో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. ఇప్పటికే వల్లభనేని వంశీ... వైసీపీలో చేరాలని నిర్ణయం తీసేసుకున్నట్లు తెలుస్తోంది. వంశీ రాకతో యార్లగడ్డ ఇరకాటంలో పడ్డారు. తన భవిష్యత్తుకి ఆటంకం కలుగుతుందని భావిస్తున్నారు.
ఈ క్రమంలో ఈరోజు ఉదయం యార్లగడ్డ మీడియా ముందుకు వచ్చారు. వంశీ పేరు ఎత్తకుండానే.. ఆయన విమర్శలు చేయడం విశేషం. టీడీపీ హయాంలో... ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని అన్నారు. జగన్, భారతమ్మలపై కూడా కేసులు పెట్టారని గుర్తు చేశారు. తాను బ్రోకర్ నికాదని పేర్కొన్నారు. అంతేకాకుండా తాను అక్రమంగా ఒక్క రూపాయి కూడా సంపాదించలేదని చెప్పారు.
Also Read: వైసీపీలోకి వల్లభనేని వంశీ: దీపావళీ తర్వాత టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా..?.
తాను ఎప్పుడూ నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి ఓట్లు సంపాదించుకోలేదన్నారు. జగన్ పై తాను పూర్తిస్థాయిలో నమ్మకం ఉందని చెప్పారు. కాగా.. గన్నవరం రాజకీయ పరిణామాలపై తమ కార్యకర్తలు ఆందోళనలో ఉన్నారని చెప్పారు. కార్యకర్తల ఆవేదన తీర్చాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు.
కాగా...గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలోకి వెళ్లడం ఖరారు కావడంతో గన్నవరం నుండి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఒడిన యార్లగడ్డ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన ఇంటి వద్ద ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. వంశీ వైసీపీలోకి వస్తే తన భవిష్యత్తేమిటని యార్లగడ్డ వాపోతున్నారు.
ఈ నేపథ్యంలో జగన్ ఇరువర్గాలకు ఆమోదయోగ్యమైన ఒక ఫార్ములాను అమలుచేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మాత్రమే పార్టీలోకి రావాలని వంశీకి కండిషన్ పెట్టాడు. వంశీకి రాజ్యసభ సీటును జగన్ ఆఫర్ చేసినట్టు నిన్న రాత్రి నుంచే వార్తలు వస్తున్నాయి.
వంశీ రాజీనామాతో ఖాళీ అయ్యే గన్నవరం సీటును యార్లగడ్డకు ఇవ్వనున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి ఇరువురినీ కూడా జగన్ ఒప్పించారు. గత ఎన్నికల్లో యార్లగడ్డ వెంకట్రావు వంశీ చేతిలో స్వల్ప తేడాతో మాత్రమే ఓటమి చెందాడు. ఇప్పుడు వంశీ రాజీనామా చేస్తే ఖాళీ అయ్యే గన్నవరం నుండి మరో మారు యార్లగడ్డ వెంకట్రావు బరిలోకి దిగనున్నారు.
వల్లభనేని వంశీ శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసిన విషయం తెలిసిందే. శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని జగన్ వంశీకి షరతు పెట్టినట్లు తెలుస్తోంది. ఆయనకు జగన్ రాజ్యసభ సీటును ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
వంశీ జగన్ ను కలుస్తున్నట్లు వార్తలు వచ్చిన మరుక్షణం యార్లగడ్డ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. శనివారంనాడు యార్లగడ్డ నివాసానికి ఆయన అనుచరులు చేరుకున్నారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వంశీని పార్టీలో చేర్చుకోవద్దని వారు డిమాండ్ చేస్తున్నారు.
వంశీని వైఎస్సార్ కాంగ్రెసులో చేర్చుకుంటే తన రాజకీయ భవిష్యత్తుకు ప్రమాదం ఏర్పడుతుందని ఆందోళన చెందుతున్న యార్లగడ్డ మంత్రులు కొడాలి నాని, పేర్ని నానీలతో కలిసి వంశీ జగన్ నివాసానికి చేరుకున్నారు. జగన్ తో వంశీ అరగంట పాటు సమావేశమయ్యారు.
AlsoRead జగన్ కు వల్లభనేని వంశీ సెగ: యార్లగడ్డ ఇంటి వద్ద ఉద్రిక్తత.
వంశీ జగన్ ను కలవడానికి ముందు బిజెపి నేత, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిని కూడా కలిశారు. అయితే, సుజనా చౌదరిని ఆయన మర్యాదపూర్వకంగానే కలిసినట్లు వార్తలు వచ్చాయి. చివరికి వంశీ వైసిపిలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వంశీపై ఇటీవల కేసు నమోదైంది. నకిలీ పట్టాలు ఇచ్చారనే ఆరోపణపై ఆ కేసు నమోదైంది.