operation royal vasista: బోటు విషయంలో మొదలైన కొత్త చర్చ

By telugu teamFirst Published Oct 26, 2019, 1:20 PM IST
Highlights

గోదావరిలో నుంచి ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి బయటకు తీసిన బోటుపై ఇప్పుడు కొత్త చర్చ మొదలయ్యింది. బోటు ను ఎం చేయాలి అనేది ఇప్పుడు తెరమీదకు వస్తున్న ప్రశ్న. 

కచ్చలూరు: గోదావరిలో నుంచి ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి బయటకు తీసిన బోటుపై ఇప్పుడు కొత్త చర్చ మొదలయ్యింది. ఇప్పుడు ఆ బయటకు తీసిన బోటును ఏం చేయాలనేదానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. బోట్ ఇసుకలో కూరుకుపోవడం, నెలరోజులకుపైగా నీటిలో ఉండిపోవడంతో, బొట్ పూర్తిగా పాడయిపోయింది. ముక్కలు ముక్కలుగా అయిపోయింది. 

బోటు సాధారణ బరువు 30 టన్నులుంటుంది. బయటకు తీసిన తరువాత దాని బరువు 20 టన్నులు మాత్రమే ఉంది. 10 టన్నులమేర బరువు తగ్గింది. బోటులోని చాలా సామాన్లు ఊడిపోయాయి. బొట్ చాల చోట్ల ముక్కలు ఊడిపోయాయి. బోట్ పూర్తిగా పాడైపోయిందని,అది ఇంక పనికిరాదని బోట్ ను బయటకు తీసిన ధర్మాది సత్యం తెలిపాడు. 

బోట్ ను ఓనర్ కు అప్పగించాలా? లేదా దానిని తుక్కుగా మార్చేసి విషాదకర ఘటన ఆనవాళ్లు లేకుండా చేయాలా అనేదానిపై అధికారులు ఆలోచనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇంకొన్ని రోజులైతే  బొట్ పోలీసుల ఆధీనంలోనే ఉండనుంది. బోట్  ప్రమాద కారణాలను ఒక నిపుణుల బృందం పరిశీలించి నివేదిక ఇవ్వనున్న విషయం తెలిసిందే. 

సెప్టెంబర్ 15న కచ్చులూరు వద్ద పర్యాటకులతో వెళ్తున్న రాయల్ వశిష్ట బోటు గోదావరిలో మునిగిపోయింది. ప్రమాద సమయంలో బోటులో మొత్తం 73 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. దీంతో ఇంకా దాదాపు 14 మంది ఆచూకీ దొరకలేదు. 

ఏసీ క్యాబిన్‌లో పలువురు ప్రయాణికులు చిక్కుకుని ఉంటారని భావించారు. మునిగిపోయిన బోటు వెలికితీత కోసం అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ధర్మాడి సత్యం బృందానికి ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇచ్చింది. 

బోటును వెలికితీసే పనిని మంగళవారం నాడు ఉదయం ధర్మాడి సత్యం బృందం ప్రారంభించింది. సోమవారం నాడు రాయల్ వశిష్ట బోటు వెలికితీసే ప్రక్రియలో బోటు పై భాగం ముక్కలు బయటకు వచ్చాయి.

గోదావరి నదిలో ఇసుక పేరుకుపోవడంతో కూడ బోటు వెలికితీతకు కొంత ఇబ్బందులు చోటు చేసుకొన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.సోమవారం ఉదయం ధర్మాడి సత్యం బృందం బోటు పైకప్పును ఎట్టకేలకు బయటకు తీసింది. రెండు రోప్‌ల మునిగిపోయిన బోటుకు కట్టి వెలుపలికి తీసేందుకు ప్రయత్నించారు. అయితే ఆ సమయంలో బోటు పైకప్పు భాగాలు బయటకు వచ్చాయి.

రాయల్‌ వశిష్ఠ పర్యాటక బోటు వెలికితీత పనులను కాకినాడ పోర్టు అధికారి కెప్టెన్‌ ఆదినారాయణ పర్యవేక్షించారు. విశాఖపట్నం నుంచి వచ్చిన ఓం శివశక్తి అండర్‌ వాటర్‌ సర్వీసెస్‌కు చెందిన పది మంది డైవర్లలో నాగరాజు, స్వామి అనే ఇద్దరు ఆదివారం ఉదయం 11 గంటలకు బోటు మునిగిన ప్రదేశంలో నీటి అడుగు భాగంలోకి వెళ్లారు.

click me!