నాకు భర్త కావాలి.. పోలీస్ స్టేషన్ లో హిజ్రా

Published : Sep 05, 2018, 10:38 AM ISTUpdated : Sep 09, 2018, 02:05 PM IST
నాకు భర్త కావాలి.. పోలీస్ స్టేషన్ లో హిజ్రా

సారాంశం

నాలుగేళ్ల కిందట శివాజీపాలేనికి చెందిన చందక సురేశ్‌ ప్రేమిస్తున్నానంటూ, పెళ్లి ప్రతిపాదన తేవడంతో దీపిక అంగీకరించింది. అయితే తాను హిజ్రాను కాబట్టి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రానివ్వనని అగ్రిమెంట్‌ రాసివ్వాలని కోరింది. 

తన భర్త తనకు కావాలని  డిమాండ్ చేస్తూ.. ఓ హిజ్రా పోలీస్ స్టేషన్ లో కలకలం సృష్టించింది.  తనను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త.. ఇప్పుడు అదనపు కట్నం కేసు వేధిస్తున్నాడంటూ ఆమె పోలీసు స్టేషన్ ని ఆశ్రయించింది. 

ఇంతకీ అసలు మ్యాటరేంటంటే... దీపిక (25)ది తూర్పుగోదావరి జిల్లా కాకినాడ. విశాఖలోని పెదవాల్తేరులో స్థిరపడింది. 2009లో ఆపరేషన్‌ చేయించుకుని మహిళగా మారింది. నాలుగేళ్ల కిందట శివాజీపాలేనికి చెందిన చందక సురేశ్‌ ప్రేమిస్తున్నానంటూ, పెళ్లి ప్రతిపాదన తేవడంతో దీపిక అంగీకరించింది. అయితే తాను హిజ్రాను కాబట్టి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రానివ్వనని అగ్రిమెంట్‌ రాసివ్వాలని కోరింది. 

సురేశ్‌ రాసిచ్చాడు. గతేడాది అక్టోబర్‌ 6న ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లు సజావుగానే సాగిన వారి కాపురంలో ఇటీవల విభేదాలు తలెత్తాయి. దీపికను సురేశ్‌, అతని మేనమామ భార్య కలిసి తమకు మరో రూ.ఆరు లక్షలు కావాలంటూ వేధించడం మొదలుపెట్టారు. అదేమిటని ప్రశ్నిస్తే ఆమెను చితక్కొట్టిన సురేశ్‌ అప్పటి నుంచి ఆమె వద్దకు వెళ్లడం మానేశాడు. దీంతో దీపిక న్యాయం కోసం జూలై 27న మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సురేశ్‌కు కౌన్సెలింగ్‌ చేసినా మారకపోవడంతో పోలీసులు కేసు నమోదుచేశారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?