ముహుర్తం ఫిక్స్.. ఈ నెల8న వైసీపీ లోకి మాజీ మంత్రి కుమారుడు

By ramya neerukondaFirst Published Sep 5, 2018, 10:15 AM IST
Highlights

ఇటీవల ఆయన బీజేపీని  వీడుతూ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జగన్‌ను కలిసి పార్టీలో చేరేందుకు ఆహ్వానం అందుకొన్న సంగతి తెలిసిందే.  

మాజీ మంత్రి నేదరుమల్లి జనార్థన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి వైసీపీ లో చేరేందుకు ముహుర్తం ఫిక్సయ్యింది. ఈ నెల 8వ తేదీన ఆయన జగన్ సమక్షంలో విశాఖలో వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

రామ్ కుమార్ రెడ్డి మంగళవారం వాకాడులోని నేదురుమల్లి నివాసంలో గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాలకు చెందిన పలువురు నాయకులతో ఆయన సమావేశమయ్యారు. రెండు రోజులుగా వెంకటగిరి, నెల్లూరు పట్టణాల్లోనూ ఆయన చేరికపై సమావేశాలు జరిగాయి.

 ఇటీవల ఆయన బీజేపీని  వీడుతూ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జగన్‌ను కలిసి పార్టీలో చేరేందుకు ఆహ్వానం అందుకొన్న సంగతి తెలిసిందే.  అనంతరం జిల్లాలోని నెల్లూరు, వెంకటగిరి, గూడూరు పట్టణాల్లో నేదురుమల్లి అభిమానులతో సమావేశాలు నిర్వహించి తర్వలో వైసీపీలో చేరే తేదీని ఖరారు చేస్తానని చెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన వాకాడులో నాయకులతో సమావేశమై తేదీని ప్రకటించారు. 

click me!