మాటలతో 500 మంది అమ్మాయిలకు వల...బాధితులంతా మంత్రులు, ఎంపీల కూతుళ్లే

By sivanagaprasad KodatiFirst Published Sep 5, 2018, 9:42 AM IST
Highlights

కేవలం మాటల మాయతో 500 మంది అమ్మాయిలను బుట్టలో వేసుకుని వారి వద్ద నుంచి భారీ మొత్తంలో నగదు, నగలు గుంజిన ఘరానా మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

కేవలం మాటల మాయతో 500 మంది అమ్మాయిలను బుట్టలో వేసుకుని వారి వద్ద నుంచి భారీ మొత్తంలో నగదు, నగలు గుంజిన ఘరానా మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కంబాల చెరువు సమీపంలో ఉండే జోగాడ వంశీకృష్ణ  సంపన్న కుటుంబంలో పుట్టాడు. అయితే పలు కారణాల వల్ల ఆస్తులన్నీ తరిగిపోయాయి.

2009లో కాకినాడ సమీపంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో చేరి మధ్యలోనే ఆపేశాడు. 2014లో హైదరాబాద్‌ వెళ్లి ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగంలో చేరాడు.. అక్కడ వ్యసనాలకు బానిసై సులభంగా డబ్బు సంపాదించేందుకు గాను ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో ఫేక్ అకౌంట్లు తెరిచాడు..  తనది అందమైన ముఖం కాకపోవడంతో... యానాం ప్రాంతానికి చెందిన యువకుడి ఫోటోను ఉంచి.. ప్రముఖులు, ధనవంతుల పిల్లలను టార్గెట్ చేసి.. మధురమైన మాటలతో మాయ చేసేవాడు..

ఇతని మాటల గాలానికి చిక్కి ఎందరో అమ్మాయిలు నగదు, నగలు అతనికి అప్పగించేవారు. ఇలా రెండున్నరేళ్ల కాలంలో సుమారు రూ.2 కోట్ల వరకు వసూలు చేశాడు. ఇతని వలలో తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల కుమార్తెలు, మేనకోడళ్లు, మహిళా డాక్టర్లు బాధితులుగా మిగిలారు. 2017లో కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలకు చెందిన ఓ వైద్య విద్యార్థినిని మాయ మాటలతో బుట్టలో వేసుకుని.. ఆమె వద్ద నుంచి 70 వేల నగదు, ఐదు కాసుల బంగారు ఆభరణాలను తీసుకుని పరారయ్యాడు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. జైలుకి వెళ్లొచ్చినా ఇతనిలో మార్పు రాలేదు..తిరిగి తన కార్యకలాపాలను ప్రారంభించి అమ్మాయిలను బుట్టలో వేసుకున్నాడు.. అయితే కాకినాడ పోలీసులు ఇతని ఆటకట్టించాలని భావించి.. నిఘా పెట్టారు... ఉభయ గోదావరి జిల్లాలతో పాటు హైదరాబాద్‌లోనూ వెతికి చివరికి కాకినాడ రైల్వే స్టేషన్ సమీపంలో వంశీకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. 

click me!