న్యాయం కోసం వచ్చిన యువతిపై అఘాయిత్యం.. ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్

By telugu teamFirst Published Jan 30, 2020, 11:00 AM IST
Highlights

మోసపోయానని గుర్తించిన సదరు బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెకు సహాయం చేయాల్సిన పోలీసు తన వక్రబుద్ధి బయటపెట్టాడు. తన కోరిక తీరిస్తే న్యాయం చేస్తానంటూ సదరు యువతిని వేధించడం గమనార్హం. నేరుగా బాధిత యువతి ఇంటికి వెళ్లి.. తలుపు గడియ పెట్టి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
 

ప్రియుడు మోసం చేశాడని తనకు న్యాయం చేయమంటూ వచ్చిన ఓ యువతిపై ఎస్ఐ అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. కాగా... ఈ ఘటనలో ఎస్ఐ బాలకృష్ణ,  ఇద్దరు కానిస్టేబుల్స్ పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఆ ఇద్దరినీ సస్పెండ్ చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... గుంటూరు శారదాకాలనీకి చెందిన యువతి వెంట మూడేళ్ల క్రితం డేవిడ్ అనే వ్యక్తి ప్రేమ పేరిట వెంటపడ్డాడు. అతని ప్రేమను సదరు యువతి కూడా అంగీకరించింది. మూడేళ్ల తర్వాత పెళ్లి చేసుకోమని కోరితే... కాదు పోమ్మన్నాడు. వెంటనే తల్లిని తీసుకొని డేవిడ్ పేరెంట్స్ దగ్గరకు బాధిత యువతి వెళ్లింది. వాళ్లు ముందు మేం పెళ్లిచేస్తామంటూ చెప్పి.. తర్వాత వాళ్లు కూడా చేతులు ఎత్తేసారు.

దీంతో మోసపోయానని గుర్తించిన సదరు బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెకు సహాయం చేయాల్సిన పోలీసు తన వక్రబుద్ధి బయటపెట్టాడు. తన కోరిక తీరిస్తే న్యాయం చేస్తానంటూ సదరు యువతిని వేధించడం గమనార్హం. నేరుగా బాధిత యువతి ఇంటికి వెళ్లి.. తలుపు గడియ పెట్టి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

Aslo Read న్యాయం కోసం వచ్చిన యువతిపై అఘాయిత్యం.. ఎస్ఐ బాలకృష్ణపై చర్యలు...

దీంతో యువతి ఎస్ఐ పై కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఓ కానిస్టేబుల్ సదరు యువతి, ఆమె తల్లిపట్ల నీచంగా ప్రవర్తించాడు. లాడ్జ్ కి వస్తే మీ సమస్య తీరుస్తానంటూ తల్లి, కూతురు ఇద్దరితో అనడం విశేషం. దీంతో ఖాకీ దుస్తుల్లో ఉన్న ఈ కామాంధులను శిక్షించాలని సదరు తల్లీకూతుళ్లు కోరుతున్నారు. 

ఈ విషయంపై బాధిత యువతి సదరు ఎస్ఐ పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుని పరిశీలించిన ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తనను వేధించిన పోలీసులతోపాటు.. ప్రేమ పేరిట మోసం చేసిన డేవిడ్ ని కూడా అరెస్టు  చేయాలని బాధిత యువతి డిమాండ్ చేసింది. ఈ క్రమంలో  ఎస్ఐ తోపాటు మరో ఇద్దరు కానిస్టేబుల్స్ ని  సస్పెండ్ చేశారు. 

click me!