గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు నోటీసులిచ్చిన హైకోర్టు

First Published Jul 25, 2018, 6:32 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యే  యరపతినేని శ్రీనివాసరావుకు బుధవారం నాడు నోటీసులు పంపింది.  మైనింగ్‌ విషయంలో ప్రభుత్వానికి నష్టం వాటిల్లేలా యరపతినేని వ్యవహరిస్తున్నారని కోర్టు అభిప్రాయపడింది. 


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యే  యరపతినేని శ్రీనివాసరావుకు బుధవారం నాడు నోటీసులు పంపింది.  మైనింగ్‌ విషయంలో ప్రభుత్వానికి నష్టం వాటిల్లేలా యరపతినేని వ్యవహరిస్తున్నారని కోర్టు అభిప్రాయపడింది. ఈ విషయమై విచారణను ఆగష్టు 21వ తేదీకి వాయిదా వేసింది.

గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు  మైనింగ్ విషయమై  బుధవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది.మైనింగ్ చేస్తూ ప్రభుత్వానికి పన్నులు చెల్లించకపోవడం విషయమై హైకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది.  మైనింగ్ పన్నులను ఎందుకు వసూలు చేయలేదో చెప్పాలని కోర్టు అధికారులను ప్రశ్నించింది.

ఈ విషయమై  సీబీఐతో పాటు ఇతర ప్రభుత్వ సంస్థలను ప్రతివాదులుగా చేస్తూ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు కూడ కోర్టు నోటీసులు జారీ చేసింది. మైనింగ్ చేయడం వల్ల ఏ మేరకు ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందనే విషయమై కాగ్ తో  లెక్క కట్టిస్తామని కోర్టు అభిప్రాయపడింది.

click me!