
ప్రకాశం జిల్లాలో సింగరాయకొండలో వైసీపీలోని ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత కొద్దిరోజులుగా కొండేపి నియోజకవర్గం వైసీపీలో విభేదాలు కొనసాగుతున్నాయి. కొండేపి నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి వరికూటి అశోక్‌బాబు అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య చిలీపోయిన నాయకులు బహిరంగంగానే ఘర్షణలకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆదివారం డీసీసీ బ్యాంకు చైర్మన్, నియోజకవర్గ వైసీపీ మాజీ ఇన్‌చార్జి మాదాసి వెంకయ్యపై ప్రస్తుత ఇన్‌చార్జి వరికూటి అశోక్‌బాబు అనుచరులు దాడికి ప్రయత్నించారు.
టంగుటూరు జాతీయ రహదారిపై ఓ టీ దుకాణం వద్ద అశోక్‌బాబు, మాదాసి వెంకయ్య వర్గీయుల మధ్య మాటామాటా పెరిగింది. ఈ క్రమంలోనే అశోక్‌బాబు, మాదాసి వెంకయ్య వర్గాలు నడిరోడ్డుపై బాహాబాహీకి దిగారు. మాదాసి వెంకయ్యపై అశోక్‌బాబు అనుచరులు దాడికి యత్నించారు. అయితే వెంకయ్యను ఆయన అనుచరులు వాహనం ఎక్కించి పంపించారు. అయితే అశోక్‌బాబు వర్గం చేసిన దాడిలో వెంకయ్య అనుచరులైన సింగరాయకొండకు చెందిన సాయివేణుతో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి.
Also Read: ప్రధాని మోదీ నివాసంపై డ్రోన్ కలకలం.. ఆరా తీస్తున్న ఢిల్లీ పోలీసులు..!!
ఈ క్రమంలోనే తనపై అశోక్‌బాబు వర్గం దాడి చేసిందని సాయి వేణు సోమవారం సింగరాయకొండలో వైఎస్సార్ విగ్రహం వద్ద నిరసకు దిగారు. అయితే దీనిని అశోక్‌బాబు వర్గీయులు అడ్డుకున్నారు. అయితే అశోక్‌బాబు అనుచరుల తీరుపై మాదాసి వెంకయ్య వర్గం మండిపడింది. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. అయితే అధికార పార్టీకి చెందిన ఇరు వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతుండటంతో.. సింగరాయకొండలో ఎప్పుడూ ఏం జరుగుతుందనే టెన్షన్ వాతావరణం నెలకొంది.