
కడప జిల్లా : కడప జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. సోమవారం ఉదయం స్కూల్ బస్సు కింద పడి నాలుగేళ్ల చిన్నారి జీనా మృతి చెందింది. కడపజిల్లా, జమ్మలమడుగులో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. విశ్వశాంతి స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతి చెందింది. బస్సు దిగుతుండగా కాలుజారి పడిపోయింది చిన్నారి. ఆమె పైనుంచి బస్సు వెళ్ళిపోయింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.