ఇళ్ల కూల్చివేత.. రామాలయంలోకి వెళ్లి తాళం వేసుకున్న జనసేన నేతలు, ఇప్పటంలో హైటెన్షన్

Siva Kodati |  
Published : Mar 04, 2023, 05:20 PM IST
ఇళ్ల కూల్చివేత.. రామాలయంలోకి వెళ్లి తాళం వేసుకున్న జనసేన నేతలు, ఇప్పటంలో హైటెన్షన్

సారాంశం

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఇప్పటంలో ఇళ్ల కూల్చివేత ఉద్రిక్తతకు కారణమైంది. స్థానిక రామాలయంలోని గర్భగుడిలోకి వెళ్లిన జనసేన నేతలు తాళం వేసుకున్నారు

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఇప్పటంలో ఇళ్ల కూల్చివేత ఉద్రిక్తతకు కారణమైంది. దీనిని అడ్డుకునేందుకు జనసేన నేతలు యత్నించారు. ఈ క్రమంలో గ్రామంలో హైటెన్షన్ నెలకొంది. ఇదే సమయంలో స్థానిక రామాలయంలోని గర్భగుడిలోకి వెళ్లిన జనసేన నేతలు తాళం వేసుకున్నారు. లోపలి నుంచే వారు నిరసన తెలియజేస్తున్నారు. జనసేన నేతలను బయటకు తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు గ్రామ సరిహద్దుల్లో పికెటింగ్ ఏర్పాటు చేసిన పోలీసులు.. వూళ్లోకి ఇతరులను రాకుండా అడ్డుకుంటున్నారు. ఐడీ కార్డులు పరిశీలించి, వివరాలు నమోదు చేసుకున్నాకే వారిని లోపలికి అనుమతిస్తున్నారు. 

మరోవైపు.. ఇళ్ల కూల్చివేతలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమణల పేరుతో కావాలనే కక్ష గట్టి కూల్చివేతలు చేపడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ బస్సు కూడా రాని ఊరికి ఆరు లైన్ల రహదారి ఎందుకని ప్రశ్నిస్తున్నారు. తాము ఎంతో కష్టపడి డబ్బు కూడబెట్టి కట్టుకున్న ఇళ్లను అన్యాయంగా కూల్చివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూల్చివేత ప్రక్రియను వ్యతిరేకిస్తూ గ్రామస్థులతో కలిసి జనసేన మద్దతుదారులు నిరసనకు దిగారు. వైసీపీ ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు  చేశారు. ఇళ్ల కూల్చివేత ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటంలో కూల్చివేతను జనసేన  పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్రంగా ఖండించారు. తమ పార్టీ సభకు స్థలాన్ని ఇచ్చారనే  వైసీపీ  సర్కార్ కక్ష గట్టి మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. 

ALso Read: ఆర్టీసీ బస్సు రాని ఊరికి రోడ్డు విస్తరణ ఎందుకు?.. ఇప్పటంలో కూల్చివేతలపై స్థానికుల ఆగ్రహం

ఇదిలా ఉంటే.. రోడ్డు విస్తరణకు సంబంధించి గతంలో ఇప్పటంలో అధికారులు కట్టడాల తొలగింపు ప్రక్రియను చేపట్టిన  సంగతి తెలిసిందే. ఆ సమయంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే తాజాగా మిగిలిన కట్టడాల తొలగింపుకు సంబంధించి ఇటీవల అధికారులు మరోమారు నోటీసులు అందజేసినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే నేడు గ్రామంలో కూల్చివేత ప్రక్రియను చేపట్టారు. కూల్చివేత ప్రక్రియ నేపథ్యంలో గ్రామంలో పోలీసులు కూడా భారీగా మోహరించారు. దీంతో ఇప్పటంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?