ప్రజావేదిక కూల్చి నేటికి మూడేళ్లు.. నిరసనకు టీడీపీ పిలుపు, చంద్రబాబు నివాసం వద్ద హైటెన్షన్

Siva Kodati |  
Published : Jun 25, 2022, 04:21 PM IST
ప్రజావేదిక కూల్చి నేటికి మూడేళ్లు.. నిరసనకు టీడీపీ పిలుపు, చంద్రబాబు నివాసం వద్ద హైటెన్షన్

సారాంశం

ప్రజావేదిక కూల్చి నేటికి మూడేళ్లు గడుస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరసనకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.  

గుంటూరు జిల్లా (guntur district) ఉండవల్లి వద్ద వున్న టీడీపీ (tdp) అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) నివాసం వద్ద శనివారం హై టెన్షన్ నెలకొంది. ప్రజా వేదికను కూల్చి నేటికి మూడేళ్లు కావొస్తుండటంతో .. టీడీపీ నేతలు నిరసనలకు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చంద్రబాబు నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అలాగే కృష్ణానది కరకట్టపై వాహనాల రాకపోకలను సైతం పోలీసులు నిలిపివేశారు. ముందుజాగ్రత్తగా బారికేడ్లు, ముళ్ల కంచెలు సిద్ధం చేశారు. మరోవైపు సీఎం వైఎస్ జగన్ నివాసం వద్ద నిరసన తెలిపేందుకు తెలుగుదేశం నేతలు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే