చలో రామతీర్థం: బాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు.. ఉద్రిక్తత

By Siva KodatiFirst Published Jan 2, 2021, 2:24 PM IST
Highlights

రామతీర్థం వ్యవహారం పార్టీల మధ్య రణరంగంగా మారింది. ఒకే రోజు మూడు పార్టీల నేతలు రామతీర్థంలో పర్యటిస్తుండటంతో ఉద్రిక్తంగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనకు ముందే అక్కడికి చేరుకున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బోడికొండపైకి వెళ్లి.. ఘటన జరిగిన తీరును పరిశీలించారు

రామతీర్థం వ్యవహారం పార్టీల మధ్య రణరంగంగా మారింది. ఒకే రోజు మూడు పార్టీల నేతలు రామతీర్థంలో పర్యటిస్తుండటంతో ఉద్రిక్తంగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనకు ముందే అక్కడికి చేరుకున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బోడికొండపైకి వెళ్లి.. ఘటన జరిగిన తీరును పరిశీలించారు.

కొండపైన ఏం జరిగిందో పార్టీ నేతలను అడిగి తెలుసుకున్నారు. దీనిపై నేతలు, ఎమ్మెల్యేలు విజయసాయిరెడ్డికి వివరించారు. అనంతరం విజయసాయిరెడ్డి కిందకు దిగిపోయారు. ఇక విశాఖ నుంచి రామతీర్థానికి బయల్దేరిన టీడీపీ అధినేత మరికొద్దిసేపట్లో అక్కడికి చేరుకుంటారు.

ఆయన కాన్వాయ్‌లోని ఇతర వాహనాలను విజయనగరంలో పోలీసులు అడ్డుకున్నారు. అయితే చంద్రబాబు కాన్వాయ్‌లోని టీడీపీ నేతల వాహనాలను విజయనగరం మూడు రోడ్ల జంక్షన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు.

భద్రతా సిబ్బంది వాహనాలను మాత్రమే అనుమతించారు. పోలీసుల తీరును నిరసిస్తూ విజయనగరంలో చంద్రబాబుతో పాటు పార్టీ నేతలు కొద్దిసేపు రోడ్డుపై బైఠాయించారు. దీంతో విజయనగరంలో ఉద్రిక్తత నెలకొంది.

టీడీపీ నేతలు వెళ్లకుండా లారీలు అడ్డుపెట్టారు. చంద్రబాబుతో పాటు తాము కూడా రామతీర్ధం వెళ్లేందుకు అనుమతించాలని కోరుతూ టీడీపీ నేతలు పట్టుబట్టారు.

అయినా పోలీసులు అనుమతించకుండా మాజీ హోంమంత్రి చినరాజప్పతో పాటు పలువురు ముఖ్యనేతల్ని అడ్డుకున్నారు. అయితే ఎట్టకేలకు పోలీసులు అనుమతించడంతో చంద్రబాబు రామతీర్థం బయల్దేరారు. 

click me!