కర్నూలు: నారా లోకేశ్ కాన్వాయ్‌ని అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణుల యత్నం.. ఉద్రిక్తత

Siva Kodati |  
Published : Aug 17, 2021, 03:21 PM IST
కర్నూలు: నారా లోకేశ్ కాన్వాయ్‌ని అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణుల యత్నం.. ఉద్రిక్తత

సారాంశం

కర్నూలులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ పర్యటన సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. లోకేశ్ కాన్వాయ్‌ని వైసీపీ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో జోక్యం చేసుకున్న పోలీసులు వైసీపీ  కార్యకర్తలను అదుపుచేశారు.   

కాగా, సోమవారం ఉదయం గుంటూరులో హత్యకు గురైన రమ్య కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన నారా లోకేష్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయనను ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. లోకేష్ రాజకీయ లబ్దికోసమే రమ్య కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వచ్చారని వైసీపీ నేతలు ఆరోపించారు. లోకేష్ రాకను నిరసిస్తూ వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. 

Also Read:మీకు ఇద్దరు కూతుళ్లున్నారు... వారికే ఇలా జరిగుంటే ఇలాగే స్పందిస్తారా?: జగన్ ను నిలదీసిన లోకేష్

వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకొంది. ఈ సమయంలో లోకేష్ తో పాటు ఉన్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను కూడ పోలీసులు అరెస్ట్ చేశారు. లోకేష్ ను అరెస్ట్ చేసి ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. తిరిగి సాయంత్రం పెదకాకాని పోలీస్ స్టేషన్ నుండి లోకేష్ ను పోలీసులు విడుదల చేశారు. 
 
PREV
click me!

Recommended Stories

Kondapalli Srinivas: చెప్పిన టైం కంటే ముందే పూర్తి చేశాం మంత్రి కొండపల్లి శ్రీనివాస్| Asianet Telugu
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్ పోర్ట్ లో రామ్మోహన్ నాయుడు స్పీచ్| Asianet Telugu