టీడీపీ అభ్యర్ధి కిడ్నాప్: ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు

Published : Jan 31, 2021, 03:41 PM IST
టీడీపీ అభ్యర్ధి కిడ్నాప్: ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు

సారాంశం

అనంతపురం జిల్లా రాయదుర్గంలో కిడ్నాప్‌నకు గురైన సర్పంచ్ అభ్యర్ధితో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఫోన్ లో మాట్లాడారు. రాయదుర్గం నియోజకవర్గంలోని బానేపల్లి సర్పంచ్ అభ్యర్ధిగా ఈరన్న ఉన్నాడు.   

అమరావతి: అనంతపురం జిల్లా రాయదుర్గంలో కిడ్నాప్‌నకు గురైన సర్పంచ్ అభ్యర్ధితో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఫోన్ లో మాట్లాడారు. రాయదుర్గం నియోజకవర్గంలోని బానేపల్లి సర్పంచ్ అభ్యర్ధిగా ఈరన్న ఉన్నాడు. 

ఈరన్నను కొందరు కిడ్నాప్ చేశారు. అయితే కిడ్నాపర్ల చెర నుండి ఈరన్న తప్పించుకొని స్వగ్రామానికి చేరుకొన్నాడు. ఈ విషయం తెలిసిన చంద్రబాబునాయుడు ఆదివారం నాడు ఈరన్నతో మాట్లాడారు. ఈరన్నను వైసీపీ వర్గీయులు కిడ్నాప్ చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

పోటీ చేస్తే చంపేస్తామని బెదిరించారని వాపోయారు. ఈ సందర్భంగా రాయదుర్గం నియోజకవర్గంలో వైసీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారంటూ చంద్రబాబు మండిపడ్డారు. ధైర్యంగా నామినేషన్ వేయాలని ఈరన్నకు సూచించారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా టీడీపీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.

ఏపీ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రధాన రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. వైసీపీ సర్కార్ బెదిరింపులకు పాల్పడుతూ ఏకగ్రీవాలు చేయిస్తోందని టీడీపీ ఆరోపించింది.

 

 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్