కిడారి హత్య ఎఫెక్ట్.. గిడ్డి ఈశ్వరికి భద్రత పెంపు

By ramya neerukondaFirst Published Sep 26, 2018, 2:45 PM IST
Highlights

వారి ఇంటివద్ద సాయుధులైన పోలీసులను కాపలా ఉంచారు. ఎక్కడికైనా పర్యటనలకు వెళ్లినప్పుడు తమకు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని పోలీసు శాఖ అయ్యన్న, గిడ్డి ఈశ్వరులకు తెలియజేశారు.

అరకులో గత ఆదివారం ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివిరి సోమ లు మావోయిస్టుల చేతిలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. కాగా.. ఆ ఇద్దరికి మాత్రమే కాకుండా మరికొంత మంది నేతలకు కూడా మావోయిస్టుల నుంచి ప్రాణహాని ఉందని సమాచారం.

ఈ నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతంలోని ప్రజాప్రతినిధులకు పోలీసులు భద్రతను పెంచారు. ఈ క్రమంలో మావోయిస్ట్‌ల హిట్ లిస్ట్‌లో ఉన్న మంత్రి అయ్యన్న పాత్రుడు,  పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి అదనపు భద్రతను కల్పించారు. వారి ఇంటివద్ద సాయుధులైన పోలీసులను కాపలా ఉంచారు. ఎక్కడికైనా పర్యటనలకు వెళ్లినప్పుడు తమకు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని పోలీసు శాఖ అయ్యన్న, గిడ్డి ఈశ్వరులకు తెలియజేశారు.

కాగా ఈ జంట హత్యల కేసులో ఇప్పటికే ముగ్గురు మావోయిస్టులను గుర్తించిన పోలీస్ బలగాలు మన్యంలో అడుగడుగునా జల్లెడ పడుతున్నాయి. దీంతో గిరిజనులు వణికిపోతున్నారు. ఇళ్లలోంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.

click me!