అమరావతి సెగ.. చిరంజీవి నివాసం వద్ద భారీ భద్రత

By telugu news team  |  First Published Feb 29, 2020, 9:54 AM IST

రైతులు చిరంజీవి ఇంటి వద్ద భారీ ఎత్తున నిరాహార దీక్షకు సన్నాహాలు చేస్తున్నారు.. అమరావతి పరిరక్షణ సమితి ఐక్యకార్యాచరణ కమిటీ దీనికి సారథ్యాన్ని వహించనుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.


ప్రముఖ సినీ నటుడు చిరంజీవి నివాసం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. అమరావతి జేఏసీ నాయకులు చిరంజీవి నివాసం ముందు ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. నివాసం దరిదాపుల్లోకి కూడా ఎవరినీ రాకుండా బారీకేడ్లను నిలిపారు. కాగా ధర్నాతో తమకు ఎలాంటి సంబంధం లేదని అమరావతి పరిరక్షణ జేఏసీ తెలిపింది.

Also Read కూలిన పెళ్లి మండపం.. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణకు గాయాలు...

Latest Videos

ఆంధ్రప్రదేశ్ లో మూడు  రాజధానులు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా... అమరావతినే రాజధానిగా కొనసాగించాలని అక్కడి రైతులు గత కొంతకాలంగా ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో... రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు, అమరావతి ప్రాంతం నుంచి సచివాలయం, హైకోర్టులను తరలించడంపై చిరంజీవి తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్ష చేపడుతున్నారు.

 రైతులు చిరంజీవి ఇంటి వద్ద భారీ ఎత్తున నిరాహార దీక్షకు సన్నాహాలు చేస్తున్నారు.. అమరావతి పరిరక్షణ సమితి ఐక్యకార్యాచరణ కమిటీ దీనికి సారథ్యాన్ని వహించనుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం చిరంజీవి క్రియాశీలక రాజకీయాల్లో లేరు. రాజకీయాల నుంచి తప్పుకొని చాలా కాలమైంది. మళ్లీ సినిమాల వైపే మొగ్గు చూపారు. ప్రస్తుతం 152వ మూవీ కోసం కసరత్తు చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వాన్ని వహిస్తోన్న ఈ మూవీ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తరువాత.. కేంద్రమంత్రిగా కొనసాగారు. రాజ్యసభ సభ్యుడిగా పదవీ కాలం ముగిసిన తరువాత రాజకీయాలకు పూర్తిగా దూరం అయ్యారు.

click me!