చంద్రబాబుపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఫైర్ అయ్యారు. ప్రజల ఆగ్రహన్ని చంద్రబాబు చవిచూశారని ఆయన అభిప్రాయపడ్డారు.
శ్రీకాకుళం: టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు విశాఖలో ప్రజాగ్రహన్ని చవిచూశారని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. గతంలో జగన్‌ను పోలీసులను పెట్టి అడ్డుకొన్న విషయాన్ని ఆయన గర్తు చేశారు.
Also read:సెక్షన్ 151 ఎలా ప్రయోగిస్తారు: చంద్రబాబు అరెస్ట్‌పై హైకోర్టు
శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబునాయుడు పర్యటనకు ఈ ప్రభుత్వం అనుమతిని ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ విషయమై ప్రజలు అడ్డుకొంటే తాము బాధ్యులమా అని ఆయన ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రజలను పట్టించుకోకుండా పర్యటనలు చేస్తామంటే ఇలాగే ఉంటుందన్నారు.
విజ్ఞత కలిగిన వారైతే పరిస్థితిని ఇక్కడకు తెచ్చుకోరని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబునాయుడు హుందాగా వ్యవహరించాల్సిందిగా ఆయన సూచించారు. కానీ, రచ్చచేయకూడదని ఆయన సలహ ఇచ్చారు.
ఏపీకి రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని టీడీపీ కోరుతోంది. కానీ, ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటుకు ఏపీ సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ఏర్పాటుకు సానుకూలమని ప్రకటించిన తర్వాతే తాము బాబు పర్యటనకు అనుమతిని ఇస్తామని వైసీపీ ప్రకటించింది.
చంద్రబాబునాయుడును కాన్వాయ్ ను విశాఖ ఎయిర్‌పోర్టులోనే నిలిపివేశారు వైసీపీ శ్రేణులు. చంద్రబాబునాయుడు విశాఖలో పర్యటించకుండానే వెనుదిరిగారు.