గ్రామ వార్డ్ సెక్రటరీలకు రిజిస్ట్రేషన్ అధికారాలు.. ఏపీ సర్కార్‌పై హైకోర్ట్ ఆగ్రహం

Siva Kodati |  
Published : Oct 19, 2022, 03:00 PM IST
గ్రామ వార్డ్ సెక్రటరీలకు రిజిస్ట్రేషన్ అధికారాలు.. ఏపీ సర్కార్‌పై హైకోర్ట్ ఆగ్రహం

సారాంశం

గ్రామ స్థాయిలో వార్డు సెక్రటరీలకు మాత్రమే రిజిష్ట్రేషన్ అధికారాలు ఇవ్వటంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై స్పందించిన న్యాయస్థానం సబ్ రిజిష్ట్రార్ ఆఫీసులలో కూడా రిజిస్ట్రేషన్స్ ప్రక్రియ జరుగుతాయని కౌంటర్ దాఖలు వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

గ్రామస్థాయిలో వార్డు సెక్రటరీలకు మాత్రమే రిజిస్ట్రేషన్ అధికారాలు కల్పిస్తూ గతంలో జారీ చేసిన జీవోలను వెనక్కు తీసుకుంది ఏపీ  ప్రభుత్వం. కేవలం వార్డు సెక్రటరీలకు మాత్రమే రిజిష్ట్రేషన్ అధికారాలు ఇవ్వటంపై హైకోర్టులో పిల్ దాఖలు చేశారు కంకిపాడుకు చెందిన కొత్తపల్లి సీతారామ ప్రసాద్. దీనిపై విచారణ సందర్భంగా కేవలం వార్డు సెక్రటరీలకు మాత్రమే రిజిస్ట్రేషన్ అధికారాలు కల్పించడం చట్ట విరుద్ధమని పిటీషనర్ తరపు న్యాయవాది హైకోర్ట్ దృష్టికి తీసుకెళ్లారు. గ్రామస్థాయిలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు సంబంధించి రిజిస్ట్రేషన్ అధికారాలు తీసివేయటం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకమన్నారు న్యాయవాది.

దీనిపై ప్రభుత్వం తరపున న్యాయవాది స్పందిస్తూ... వార్డ్ సెక్రటరీలతో పాటుగా సబ్ రిజిష్ట్రార్ ఆఫీసులకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే అధికారాలు కొనసాగుతాయని ధర్మాసనానికి తెలిపారు. సబ్ రిజిష్ట్రార్ ఆఫీసులలో కూడా రిజిస్ట్రేషన్స్ ప్రక్రియ జరుగుతాయని కౌంటర్ దాఖలు వేయాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. అనంతరం విచారణను నవంబర్ 1కి వాయిదా వేసింది. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం